అన్నా, చెల్లెళ్ళ అక్రమ సంబంధం..అడ్డుగా ఉన్న భర్త ఖతం

సమాజంలో మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారి పోతున్నాయి, తాత్కాలికమైన శారీరక సుఖాల కోసం వావి వరసలు మర్చిపోయి పుశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆ సుఖాల కోసం అడ్డువచ్చిన వారిని అంతమొందిస్తున్నారు. అన్నా చెల్లెళ్ళ బంధానికి మచ్చతెచ్చేలా అన్న వరస వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఓ ఇల్లాలు.
భర్తకు తెలియకుండా… అన్నా చెల్లెళ్లు రొమాన్స్ లో మునిగి పోయేవారు. కరోనా దెబ్బకు ఇంటికే పరిమితమైన భర్త తమ సుఖానికి అడ్డం వస్తున్నడని భర్తనే అంతమొందించిందా ఇల్లాలు.
ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా పరిధిలోని ఖండా గ్రామానికి చెందిన ఠాకూర్ నోయిడా లోని ఒక ప్రయివేటు కంపెనీలో డిజైనర్ గా పని చేస్తున్నాడు. భార్య రవీన, ఏడాదిన్నర కొడుకుతో అక్కడే నివాసం ఉంటున్నాడు.
కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఫ్రకటించటంతో మార్చి 24న భార్య పిల్లాడితో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలో వీరి ఇంటి పక్కన రవీనాకు అన్న వరస అయ్యే ప్రతాప్ కూడా నివసిస్తున్నాడు.
రవీనా, ప్రతాప్ ల మధ్య వివాహేతర సంబంధం చాలాకాలం నుంచి కొనసాగుతోంది. రవీనా గ్రామానికి వచ్చినప్పటి నుంచి వీరిద్దరి రాసలీలలకు అంతు లేకుండా పోయింది. భర్తకు తెలియకుండా అన్నప్రతాప్ ఇంటికి వెళుతున్నానని చెప్పి…అక్కడ ఆమె ప్రతాప్ తో రాసలీలలు కొనసాగిస్తోంది.
ఈ వ్యవహారం ఇటీవల విక్రమ్ కంట పడింది. విక్రమ్ భార్య రవీనాను తీవ్రంగా మందలించాడు. దీంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను అంతమొందించాలని, అన్న- ప్రియుడు అయిన ప్రతాప్ తో కలిసి రవీనా ప్లాన్ చేసింది.
ఏప్రిల్ 2వ తేదీ తెల్లవారు ఝూము 2-30 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న భర్త విక్రమ్ ను, ప్రతాప్, రవీనాలిద్దరూ గొంతుకోసి కిరాతకంగా హత్యచేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న విక్రమ్ను చూసిన ఇతర కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు రవీనాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రవీనా ఫోన్ కాల్ లిస్టు పరిశీలించగా చాలాకాలం నుంచి ప్రతాప్ తో ఆమె అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.
ప్రతాప్ పరారీలో ఉన్నాడు. రవీనాపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసినట్లు బర్హాన్ పోలీసు స్టేషన్ఎస్ఐ మహేంద్రసింగ్ యాదవ్ తెలిపారు. ప్రతాప్ రవీనాల మధ్య చాలా కాలంగా అక్రమ సంబంధం నడుస్తున్నట్లు గుర్తించామని, ప్రతాప్ పట్టుబడితే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని మహేంద్రసింగ్ యాదవ్ చెప్పారు.