తనను మోసం చేశారంటూ పోలీస్ స్టేషన్‌కు యాంకర్ రవి

  • Published By: vamsi ,Published On : February 10, 2020 / 04:25 AM IST
తనను మోసం చేశారంటూ పోలీస్ స్టేషన్‌కు యాంకర్ రవి

Updated On : February 10, 2020 / 4:25 AM IST

తనను సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి మోసం చేశాడంటూ.. న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడు బుల్లితెర స్టార్ యాంకర్ రవి. సందీప్ అనే వ్యక్తి తన దగ్గర రూ. 45లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. 45 లక్షలు అప్పుగా తీసుకున్న సందీప్.. కొన్ని రోజుల తర్వాత కొంత డబ్బులు ఇచ్చాడని.. అయితే మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడగ్గా బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో రవి చెప్పుకొచ్చాడు.

అంతేకాదు.. తాను ఎక్కడికెళ్లినా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులను పంపి బెదిరిస్తున్నాడని రవి అందులో వెల్లడించాడు. తన దగ్గర తీసుకున్నట్లే చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్న సందీప్ వారిని కూడా ఇలాగే మోసం చేశాడని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపించాలంటూ మోసం చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేశాడు. యాంకర్ రవి హీరోగా ‘ఇది మా ప్రేమ కథ’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు సందీప్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో విభేదాలు మొదలయ్యాయి. అయితే అంతకుముందు సందీప్ కూడా యాంకర్ రవిపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు సందీప్. తనను బెదిరిస్తున్నారంటూ యాంకర్ రవిపై ఫిర్యాదు చేశారు సందీప్.