Tamil Nadu : తమిళనాడులో మరో విద్యార్ధిని ఆత్మహత్య-10 రోజుల్లో రెండో ఘటన

తమిళనాడులోని సేలం జిల్లాలో 12వ తరగతి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే  మరోక 12వ తరగతి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

Tamil Nadu : తమిళనాడులో మరో విద్యార్ధిని ఆత్మహత్య-10 రోజుల్లో రెండో ఘటన

Tamilnadu

Updated On : July 25, 2022 / 8:35 PM IST

Tamil Nadu : తమిళనాడులోని సేలం జిల్లాలో 12వ తరగతి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే  మరోక 12వ తరగతి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

టెక్కులూరుకు చెందిన 17 ఏళ్ల విద్యార్ధిని  తిరువళ్ళూరు ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం తోటి బాలికలు పాఠశాలకు వెళ్లగా తాను ఆలస్యంగా వస్తానని వారికి చెప్పింది. అయితే విద్యార్ధిని ఎంతకూ స్కూలుకు రాకపోయే సరికి అనుమానం వచ్చిన సిబ్బంది హాస్టల్ గదికి వెళ్లి చూడగా బాలిక సీలింగ్‌కు ఉరివేసుకుని శవమై కనిపించింది.

సమాచారం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు హాస్టల్ వద్దకు వచ్చి స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. సరైన సమయంలో తమకు సమాచారం ఇవ్వలేదని తమ కూతురు మృతికి యాజమాన్యమే బాధ్యత వహించాలని తిరుత్తణి రహదారిపై   రాస్తారోకో నిర్వహించారు.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఆందోళనతో ఆ ప్రాంతం కొంత ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలం వద్దకు వచ్చి పరిస్ధితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. మప్పేడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అవ్వగా కేసును సీబీ సీఐడీ అధికారులకు అప్పచెప్పినట్లు కాంచీపురం రేంజ్ డీఐజీ ఎం సత్యప్రియ చెప్పారు. విచారణ కోసం అధికారులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్ధితుల నేపధ్యంలో పాఠశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది.

బాలిక మృతదేహాన్ని తిరువళ్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా బాలిక మృతదేహాన్ని తీసుకునేందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. బాలిక మృతికి కారణం చెపితేనే మృతదేహాన్ని తీసుకు వెళతామని బాలిక సోదరి గాయత్రి తెలిపింది. తన సోదరి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని… ఆదివారం రాత్రి కూడా తమతో మాట్లాడిందని ఆమె వివరించింది.  కేసు దర్యాప్తు లో ఉంది.

Also Read : Kidnap : 15 ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసిన వివాహిత