Anti-Maoist Posters : మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు,కరపత్రాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పలుచోట్ల మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి.

Anti-Maoist Posters : మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు,కరపత్రాలు

Postars Surface In Bhadadri Dist

Updated On : December 6, 2021 / 10:38 AM IST

Anti-Maoist Posters :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పలుచోట్ల మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. మండలంలోని తిప్పాపురం, ఆర్. కొత్తగూడెం, పూసుగుప్ప వెళ్ళే ప్రధాన రహదారి వెంకట చెరువు గ్రామం వద్ద, మండల కేంద్రంలోని ఆయిల్ బంక్ సెంటర్, బస్‌స్టాండ్ సెంటర్, గాంధీబొమ్మ సెంటర్, అంబేద్కర్ సెంటర్ తదితర ప్రాంతాలలో ఇవి కనపించాయి.
Also Read : Birth Day Party : బర్త్‌డే పార్టీలో అపశృతి-చెరువులో పడి యువకుడు మృతి
మావోయిస్టులు ఆదివాసి గ్రామాలలో అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, అభివృద్ధి కావాలా? మావోలు కావాలా?… ఆదివాసి గ్రామాలలో మావోయిస్టులు గిరిజన ప్రజలను బెదిరిస్తూ బలవంతంగా పార్టీలో చేర్చుకుంటున్నారు. ఆదివాసీ గిరిజనులపై మావోయిస్టుల దౌర్జన్యాలు ఇంకెన్నాళ్లు? అంటూ.. సోమవారం తెల్లవారుజామున పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి.