Attempt To Rape : వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం
బాధ్యత కల కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూ వివాహితపై అత్యాచార యత్నంచేసిన ఏఆర్ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Atp Constable Rape Attempt
Attempt to Rape : బాధ్యత కల కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూ వివాహితపై అత్యాచార యత్నంచేసిన ఏఆర్ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురంలోని రుద్రంపేటలో నివసించే ఆదినారాయణ 2005 సంవత్సరంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పోలీసు శాఖలో చేరాడు. ప్రస్తుతం సెబ్ లో డెప్యూటేషన్ మీద పని చేస్తున్నాడు.
ఆదినారాయణకు నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో స్నేహితుడు ఉన్నాడు. తరచూ అతని ఇంటికి వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆదినారాయణ, స్నేహితుడి ఇంట్లో అద్దెకు ఉంటున్న కుటుంబంలోని ఒక వివాహితపై కన్నేశాడు. ఈనెల 3వ తేదీ ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంటికి వెళ్ళాడు.
Also Read : Man Stabbed To Death : అప్పుగా తీసుకున్న రూ.300 తిరిగి ఇవ్వలేదని యువకుడి హత్య
ఆమెతో మాటలు కలిపాడు. అతని వాలకాన్ని పసిగట్టిన మహిళ… తన అన్నకు ఫోన్ చేసి మాట్లాడకుండా ఆన్ చేసి అలాగే ఉంచింది. ఈక్రమంలో ఆదినారాయణ మాట్లాడే మాటలు ఫోన్ లో వినపడసాగాయి. ఇంతలో ఆదినారాయణ ఆ మహిళపై అత్యాచారం చేయబోయాడు. అదే సమయంలో ఆమె ఇంటికి చేరుకున్న ఆమె అన్న, ఆదినారాయణకు చివాట్లు పెట్టి అక్కడి నుంచి పంపించివేశాడు.
అనంతరం బాధిత మహిళ కుటుంబ సభ్యులతో కలిసి దిశ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈవిషయాన్ని జిల్లా ఎస్పీ ఫకీరప్ప దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై లోతుగా విచారణ జరపాలని ఎస్పీ ఆదేశించటంతో ఆదినారాయణపై అత్యాచారయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతని సస్పెన్షన్ కు రంగం సిధ్ధం అయ్యింది. నేడో, రేపో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.