Guwahati: ఆర్మీ జవాన్‌ను తొక్కి చంపిన అడవి ఏనుగు

ఇది అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇదే క్రమంలో శనివారం ఖమిలన్ డ్యూటీలో ఉండగా అడవి ఏనుగు దాడి చేసింది. అతడిని తొక్కి గాయపరిచింది. వెంటనే స్పందించిన ఆర్మీ సిబ్బంది ఖమిలన్‌ను రక్షించి, బసిష్ట ప్రాంతంలోని ఆర్మీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Guwahati: ఆర్మీ జవాన్‌ను తొక్కి చంపిన అడవి ఏనుగు

Updated On : February 12, 2023 / 8:54 PM IST

Guwahati: అసోం రాజధాని గువహటి పరిధిలో దారుణం జరిగింది. డ్యూటీలో ఉన్న భారత ఆర్మీ జవాన్‌ను అడవి ఏనుగు తొక్కి చంపింది. ఈ ఘటన నారెన్గి కంటోన్మెంట్ ఏరియాలో శనివారం సాయంత్రం జరిగింది. ఆర్మీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 222 అడ్వాన్స్‌డ్ బేస్ ఆర్డ్నెన్స్ డిపో (ఏబీఓడీ)కి చెందిన ఖమిలన్ కాప్ అనే జవాను నారేన్గి కంటోన్మెంట్ పరిధిలో డ్యూటీలో ఉన్నాడు.

Asian Indoor Championships: ఆసియన్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకాలు.. మహిళా పోల్ వాల్ట్‌లో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్

ఇది అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇదే క్రమంలో శనివారం ఖమిలన్ డ్యూటీలో ఉండగా అడవి ఏనుగు దాడి చేసింది. అతడిని తొక్కి గాయపరిచింది. వెంటనే స్పందించిన ఆర్మీ సిబ్బంది ఖమిలన్‌ను రక్షించి, బసిష్ట ప్రాంతంలోని ఆర్మీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడ చికిత్స పొందుతూ ఖమిలన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ఆర్మీ అధికారులు విచారణ వ్యక్తం చేశారు. ఏనుగు దాడి నేపథ్యంలో ఆర్మీ అధికారులు, డ్యూటీలో ఉన్న ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు సూచనలు చేశారు.

Uttarakhand: పరీక్షల్లో మోసానికి పాల్పడితే జీవిత ఖైదు.. కొత్త చట్టం తెచ్చిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం

ఏనుగుల సంచారం దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తత పాటించాలని ఆదేశించారు. ఈ ప్రాంతం ఆంచంగ్ అభయారణ్యం పరిధిలో ఉండటంతో అటవీ జంతువుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇది ఏనుగులు ఎక్కువగా ఉండే ప్రాంతమే అయినప్పటికీ, అవి గతంలో ఎవరికీ పెద్దగా హాని చేసింది లేదు. ఇక్కడ అవి స్వేచ్ఛగానే తిరుగుతుంటాయని అధికారులు తెలిపారు. కానీ, తాజా ఘటన ఆందోళన కలిగిస్తోందని ఆర్మీ అధికారులు అన్నారు.