Assam: హిందూ మతంలోకి మారిన ఇస్లాం మహిళా డాక్టర్‭పై కుటుంబమే కక్షగట్టింది.. ఏకంగా సీఎం రంగంలోకి దిగారు

హిందూ మతంలోకి మారిన ఓ ముస్లిం మహిళా డాక్టర్ తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపించింది. ఆమెకు కుటుంబ సభ్యులే శత్రువులు కావడంతో వారి భయానికి దాక్కోవలసి వచ్చింది

Assam: హిందూ మతంలోకి మారిన ఇస్లాం మహిళా డాక్టర్‭పై కుటుంబమే కక్షగట్టింది.. ఏకంగా సీఎం రంగంలోకి దిగారు

Updated On : September 3, 2023 / 7:17 PM IST

Muslim Woman: మతం మారడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అయినప్పటికీ.. కొంత మంది అతికి ఇదెప్పుడూ వివాదాస్పదమవుతోంది. హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారడంపై ప్రభుత్వంలో ఉన్నవారే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడం చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు ఇతర మతాల నుంచి హిందూ మతంలోకి మారారని వివాదాస్పదమవుతుండడం కూడా కనిపిస్తూనే ఉంటుంది. ఇక తాజాగా అస్సాం రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.

Putta Madhu : నన్ను చంపేందుకు కుట్ర..? పుట్ట మధుపై సంచలన ఆరోపణలు, టికెట్ ఆశిస్తే చంపేస్తారా?

హిందూ మతంలోకి మారిన ఓ ముస్లిం మహిళా డాక్టర్ తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపించింది. ఆమెకు కుటుంబ సభ్యులే శత్రువులు కావడంతో వారి భయానికి దాక్కోవలసి వచ్చింది. అయితే ఆమె కనిపించకపోవడంతో ఆమె కిడ్నాప్ అయిందని సోదరుడు కేసు వేశాడు. అనతరం తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని ముస్లిం మహిళా డాక్టర్ వీడియో ద్వారా ఒక పోస్ట్‌లో తెలిపారు. తన కుటుంబ సభ్యులు తనను బలవంతంగా మౌలానాతో పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె అందుకే తాను కుటుంబం నుంచి దూరంగా పారిపోయానని వెల్లడించింది.

Viral Video: గర్భంతో ఉన్న నల్లజాతీయురాలిని కాల్చి చంపిన పోలీసు.. ఎందుకంటే?

తనకంటే చాలా పెద్దవాడైన మతపెద్దను పెళ్లి చేసుకుంటే తన జీవితం ‘స్వర్గం’లా మారుతుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారని ఆ మహిళ తెలిపింది. మహిళ తన ఇంటి నుంచి తప్పిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు పోలీసుల సహాయాన్ని కోరింది. ఆ సమయంలోనే వీడియో బయటపడింది. ఆ వీడియోలో తాను సురక్షితంగా ఉన్నానని, తన భద్రత కోసం కుటుంబానికి దూరంగా ఉన్నట్లు తెలిపింది. అయితే విషయం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ దృష్టికి వెళ్లడంతో, ఈ విషయంపై వెంటనే దర్యాప్తు చేయాలని ఆయన డీజీపిక ఆదేశాలు జారీ చేశారు.