Atchutapuram : మిస్టరీగా మారిన యువతి మృతి.. మహాలక్ష్మి మృతదేహానికి పోస్టుమార్టం

Atchutapuram : తమ కూతురి మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ నుంచి ప్రేమించుకున్న జంట పెళ్లి చేసుకుంది.

Atchutapuram : మిస్టరీగా మారిన యువతి మృతి.. మహాలక్ష్మి మృతదేహానికి పోస్టుమార్టం

Atchutapuram Mystery Case

Atchutapuram Mystery Case : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం లాడ్జిలో యువతి మృతి మిస్టరీగా మారింది. హత్య కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. యువతి మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. యువతి శరీరంపై కత్తిపోట్లు ఉండటంపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేజీహెచ్ దగ్గర ఆందోళనకు దిగారు. తమ కూతురి మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ నుంచి ప్రేమించుకున్న జంట పెళ్లి చేసుకుంది. కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో యువతి అనుమానాస్పద మృతి మిస్టరీగా మారింది.

Also Read..Delhi Girl Case : ఢిల్లీలో 16ఏళ్ల బాలిక దారుణ హత్య.. నిందితుడు సాహిల్ అరెస్ట్.. షాకింగ్ వీడియో

మహాలక్ష్మి మృతదేహాన్ని కేజీహెచ్ CSR బ్లాక్ నుండి మార్చురీకి తరలించారు. కాసేపట్లో యువతి పోస్టుమార్టం ప్రారంభం కానుంది. అటు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో శ్రీనివాస్ కుమార్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పరవాడ డీఎస్పీ సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. లాడ్జిలో యువతి అనుమానాస్పద స్థితిలో చెందింది. అసలేం జరిగింది? అనేది మిస్టరీగా మారింది. యువతి అనుమానాస్పద మృతి స్థానికంగా సంచలనంగా మారింది.

అచ్యుతాపురంలోని లాడ్జిలో యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. యువతి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహాలక్ష్మి శరీరంపై కత్తిపోట్లు ఉండటం, మహాలక్ష్మి రక్తపు మడుగులో ఉండటంపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అమ్మాయి తండ్రి..
”ప్రేమించాలని టార్చర్ పెట్టాడు. భయపెట్టాడు. నన్ను చేసుకోకపోతే మీ నాన్నను, అమ్మను, నిన్ను చంపుతాను అని బెదిరించాడు. రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్నట్లు నా కూతురు చెప్పింది. వాడు నన్ను బాగా వేధిస్తున్నాడు అని చెప్పింది. ఎస్టీ కులాన్ని దూషించేవాడు. వాళ్ల అక్క, అమ్మ.. ఎస్టీ అమ్మాయివి అని నన్ను దూషించేవారు” అని నా కూతురు నాతో చెప్పింది.

”ఒక మహిళను ఇంత కిరాతకంగా చంపడం బాధాకరం. హంతకుడిని ఉరితీయాలి. అమ్మాయిని ఏ విధంగా అయితే చిత్రహింసలు పెట్టి చంపాడో అలాగే అబ్బాయిని కూడా చిత్రహింసలు పెట్టాలి. వాడికి ఉరిశిక్ష వేయాలి” అని మృతురాలి బంధువులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read..Chicken : వార్నీ.. భార్య చికెన్ వండలేదని భర్త ఆత్మహత్య

అచ్యుతాపురంలోని ఒక లాడ్జిలో నిన్న (మే 29) సాయంత్రం దారుణం జరిగింది. లాడ్జిలోని రూమ్ లో యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. యువతి మెడపై కత్తి పోట్లు ఉండడంతో యువకుడు ఆమెపై దాడి చేసి హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. యువకుడి శరీరంపైనా కత్తిపోట్లు ఉండటం మరిన్ని అనుమానాలకు దారితీసింది. యువతిని హతమార్చిన యువకుడు.. తనను తాను పొడుచుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో యువతి మృతి చెందింది. కొన ఊపిరితో ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పక్కా పథకం ప్రకారమే తమ కూతురిని శ్రీనివాస్ కుమార్ హతమార్చాడని మహాలక్ష్మి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

పక్కా పథకం ప్రకారమే..? సత్యనారాయణమూర్తి, పరవాడ డీఎస్పీ
రూమ్ లో నుంచి కేకలు వచ్చినట్లు సిబ్బంది విన్నారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపుతట్టారు. శ్రీనివాస్ కుమార్ బాత్ రూమ్ లో ఉన్నాడు. వస్తాను వస్తాను అని అన్నాడు. దీంతో పోలీసులు బలవంతంగా తలుపులు తెరిచి లోనికి వెళ్లారు. అక్కడ మహాలక్ష్మి చనిపోయి ఉంది. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి. చిన్న చిన్న గాయాలతో శ్రీనివాస్ కుమార్ బాత్ రూమ్ లో అపస్మారక స్థితిలో ఉన్నాడు. రూమ్ లో ఇంజెక్షన్, నీడిల్స్ ఉన్నాయి. వెంటనే ఆ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించాము. అప్పటికే యువతి చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.

భర్త శ్రీనివాస్ ప్రవర్తన నచ్చక మహాలక్ష్మి విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించింది. ఈ కేసు వాయిదాలకు ఇద్దరూ రావడం లేదు. ఏదో ఒకరకంగా శ్రీనివాస్ కుమార్ నుంచి విడిపోయి స్వేచ్చగా బతకాలని మహాలక్ష్మి అనుకుంది. ఈ క్రమంలో శ్రీనివాస్ కుమార్ ఉద్దేశపూర్వకంగా అమ్మాయిని లాడ్జికి తీసుకెళ్లాడు. ఆమె ప్రతిఘటించకుండా ఉండేందుకు మత్తు లాంటి ఇంజెక్షన్ ఇచ్చాడా? అనేది తెలియాల్సి ఉంది. లేదంటే.. కేకలు కూడా వినపడ్డాయి కనుక.. విచక్షణారహితంగా కత్తితో మహాలక్ష్మిని పొడిచాడా? తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనే శ్రీనివాస్ కుమార్ పొడుచుకున్నాడా? అనేది దర్యాఫ్తులో తేలుతుంది. సీసీ ఫుటేజీ కూడా వెరిఫై చేస్తున్నాం.