అసలేం జరిగింది : వాకింగ్‌కు వెళ్లిన దంపతులపై వేటకొడవళ్లతో దాడి

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కలకలం చెలరేగింది. దంపతులపై హత్యాయత్నం జరిగింది. వరంగల్ రోడ్డుకు ఉదయం వాకింగ్‌కు వెళ్లిన అంబటి వెంకన్న, అతని భార్యపై గుర్తు

  • Published By: veegamteam ,Published On : September 18, 2019 / 04:26 AM IST
అసలేం జరిగింది : వాకింగ్‌కు వెళ్లిన దంపతులపై వేటకొడవళ్లతో దాడి

Updated On : September 18, 2019 / 4:26 AM IST

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కలకలం చెలరేగింది. దంపతులపై హత్యాయత్నం జరిగింది. వరంగల్ రోడ్డుకు ఉదయం వాకింగ్‌కు వెళ్లిన అంబటి వెంకన్న, అతని భార్యపై గుర్తు

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కలకలం చెలరేగింది. దంపతులపై హత్యాయత్నం జరిగింది. వరంగల్ రోడ్డుకు ఉదయం వాకింగ్‌కు వెళ్లిన అంబటి వెంకన్న, అతని భార్యపై గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో  దాడి చేశారు. ఈ దాడిలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంకన్న రాజకీయ నేత.

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. భూతగాదాల వల్లే దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. కాగా, పట్టపగలు.. రోడ్డుపై వేటకొడవళ్లతో దాడి జరగడం స్థానికంగా కలకలం రేపింది. వాకింగ్ కు వచ్చిన వారు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.