బంజారాహిల్స్‌లో కలకలం : నడిరోడ్డుపై శిశువు తల
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో దారుణం చోటు చేసుకుంది. ఓ శిశువు తల నడిరోడ్డుపై పడి వుండటం కలకలం రేపింది. మొండెం లేని శిశువు తలను చూసి

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో దారుణం చోటు చేసుకుంది. ఓ శిశువు తల నడిరోడ్డుపై పడి వుండటం కలకలం రేపింది. మొండెం లేని శిశువు తలను చూసి
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో దారుణం చోటు చేసుకుంది. ఓ శిశువు తల నడిరోడ్డుపై పడి వుండటం కలకలం రేపింది. మొండెం లేని శిశువు తలను చూసి భయాందోళనకు గురైన స్థానికులు… వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి.. చిన్నారి తలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
అయితే.. తల లభ్యమైన ప్రదేశానికి సమీపంలోనే స్మశానం ఉంది. దీంతో అక్కడి నుంచి కుక్కలు తీసుకువచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు. శిశువు మృతదేహాన్ని సరిగ్గా పూడ్చకపోవడంతో ఈ దారుణం జరిగి ఉంటుందని చెబుతున్నారు. చిన్నారి తల స్మశానవాటికలోనిదేనా? లేదంటే ఎవరైనా దారుణానికి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు మాత్రం… నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఎవరో క్షుద్రపూజలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
రోజుల వయసున్న శిశువు తల భాగం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అసలేం జరిగిందోనని టెన్షన్ పడుతున్నారు. కాగా, స్థానికంగా ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా.. సమీపంలో ఉన్న స్మశాన వాటిక నుంచి ఓ కుక్క శిశువు తల భాగాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో స్మశాన వాటికలో పూడ్చిపెట్టిన మృతదేహాలు బయటపడుతున్నట్లు అనుమానించారు. వారం రోజుల క్రితం కూడా ఇలానే ఓ శిశువు మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన చోటుచేసుకుందన్నారు.