Pudding And Mink Pub : బెయిల్ పిటీషన్ కొట్టివేత, 4 రోజుల పోలీసు కస్టడి

హైదరాబాద్ బంజారాహిల్స్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో అనిల్, అభిషేక్ లు వేసిన బెయిల్ పిటీషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. నిందితులిద్దరినీ నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీకి

Pudding And Mink Pub : బెయిల్ పిటీషన్ కొట్టివేత, 4 రోజుల పోలీసు కస్టడి

Pudding And Mink Pub Case

Updated On : April 11, 2022 / 6:53 PM IST

Pudding And Mink Pub :  హైదరాబాద్ బంజారాహిల్స్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో అనిల్, అభిషేక్ లు వేసిన బెయిల్ పిటీషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. నిందితులిద్దరినీ నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది.

ఈనెల 14 నుంచి 18 వరకు నిందితులిద్దరినీ పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోనున్నారు. నిందితులు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో దొరికిన డ్రగ్స్‌కి వీరికి ఉన్నసంబంధాలపై పోలీసులు విచారణలో తేల్చనున్నారు.

ఈనెల 14న నిందితులను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చి పోలీసులు విచారించనున్నారు. ఈ డ్రగ్స్ ఎవరెవరు వాడుతున్నారు. డ్రగ్స్ సప్లై వెనుక ఇంకెవరు ఉన్నారు అనేది పోలీసుల విచారణలో తేలుతుందని పోలీసులు భావిస్తున్నారు.

Also Read : Gang Rape : మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం-ఏడుగురు అరెస్ట్