Bank Employ Incident: బ్యాంకు బాత్రూమ్‌లో ఉద్యోగి ఆత్మహత్య.. అనంతపురంలో విషాదం.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్
రవికుమార్ రాసిన సూసైడ్ నోట్ కంటతడి పెట్టిస్తోంది. అందులో తన చావుకి కారణం ఏంటో తెలిపాడు.

Bank Employ Incident: అనంతపురము నగరం గుత్తి రోడ్ లోని సెంట్రల్ బ్యాంకులో కలకలం రేగింది. ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సెంట్రల్ బ్యాంక్ లోని టాయ్ లెట్ లో ఉరి వేసుకున్నాడు. మృతుడిని రవికుమార్ గా గుర్తించారు. సెంట్రల్ బ్యాంక్ లో సబ్ స్టాఫ్ ఉద్యోగం చేస్తున్నాడు రవి కుమార్. అప్పుల బాధతోనే ఉరి వేసుకున్నట్లు సూసైడ్ లెటర్ లో రాశాడు. రవికుమార్ రాసిన సూసైడ్ నోట్ కంటతడి పెట్టిస్తోంది. అందులో తన చావుకి కారణం ఏంటో తెలిపాడు.
తన భార్య హరితకు లెటర్ రాశాడు బ్యాంక్ ఉద్యోగి రవికుమార్. ”హరిత నన్ను క్షమించు, నేను బతకడం వల్ల నీకు పిల్లలకు ఎలాంటి లాభం లేదు. నేను చేసుకున్న అప్పులే నాకు శాపంగా మారాయి. పిల్లల్ని, నిన్ను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం” అంటూ లేఖలో రాశాడు. ”నేను ఎటువంటి జూదాలు ఆడ లేదు. అధిక వడ్డీకి తెచ్చిన అప్పులే ఇప్పుడు శాపంగా మారాయి. అమ్మ, పిల్లలు జాగ్రత్త” అంటూ సూసైడ్ నోట్ లో రాశాడు. పోస్టుమార్టం నిమిత్తం బాడీని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు పోలీసులు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.