Bengaluru Crime : బెంగళూరులో కారు బీభత్సం.. పాదాచారులపైకి దూసుకెళ్లిన కారు.. షాకింగ్ వీడియో..!

Bengaluru Crime : బెంగళూరులో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న పాదాచారులపైకి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది.

Bengaluru Crime : బెంగళూరులో కారు బీభత్సం.. పాదాచారులపైకి దూసుకెళ్లిన కారు.. షాకింగ్ వీడియో..!

Bengaluru News 1 Killed And 3 Injured When A Speeding Car Rammed Into A Bunch Of Pedestrians

Updated On : May 21, 2022 / 10:03 PM IST

Bengaluru Crime : బెంగళూరులో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న పాదాచారులపైకి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతిచెందాగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం (మే 20) ఉదయం 7.20 గంటలకు బనశంకరి ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నడుస్తున్న పాదాచారులపైకి కారు వేగంగా దూసుకొచ్చింది. కారు ఢీకొన్న వెంటనే వ్యక్తి గాల్లో ఎగిరిపడ్డాడు. మరో ముగ్గురు పార్కింగ్ వాహనాల మధ్య పడి గాయాలపాలయ్యారు.

శివమొగ్గ జిల్లాకు చెందిన అలియాస్ సురేష్ కుమార్‌ క్యాటరింగ్ కంపెనీలో పని చేస్తున్నాడు. తోటి ఉద్యోగులతో కలిసి అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నాడు. రుద్రప్ప బస్టాప్‌ వద్దకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్నేహితుడు శ్రీనివాస్‌తో కలిసి కారులో వేగంగా వెళ్తుండగా కంట్రోల్ కోల్పోయాడు. ఈ ప్రమాదంలో రుద్రప్ప తీవ్రంగా గాయపడ్డాడు.

సహచరులు సచిన్‌, శివరాజుతోపాటు విద్యార్థి శైలేంద్రను ముఖేష్‌, స్నేహితుడుతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రుద్రప్ప మరణించాడు. గత రెండు రోజులుగా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ముఖేష్‌ నిద్రమత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి సీసీటీవీలో రికార్డు అయింది.

Read Also :