పవిత్రస్నానం చేసేందుకు వెళ్లి..ఆరుగురు మృతి

బీహార్ లో దారుణం జరిగింది. ఇవాళ(నవంబర్-12,2019)కార్తీక పూర్ణిమ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లి నదిలో మునిగి ఆరుగురు చనిపోయారు.
బీహార్ లోని నవాడా జిల్లాలోని కవకోల్ ఏరియాలోని ఆలయానాకి ఇవాళ కార్తీక పూర్ణిమ సందర్భంగా పూజలు చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ సమయంలో ఆలయానికి దగ్గర్లో పవిత్రస్నానం చేసేందుకు ఈత కొట్టడం తెలియని నలుగురు చిన్నారులు నదిలోకి దిగారు. చిన్నారులు మునిగిపోవడాన్ని గమనించిన అవినాష్ కుమార్(40)అనే వ్యక్తి వారిని కాపాడేందుకు నదిలోకి దూకాడు. అయితే ముగ్గురు చిన్నారులతో పాటు అవినాష్ కుమార్ కూడా ప్రాణాలు కోల్పోయాడని అతడి కుటుంబసభ్యులు తెలిపారు.
నలంద జిల్లాలోని పవపురి ఏరియాలోని సక్రి నదిలో ఇవాళే జరిగిన మరో ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఆరుగురు మృతదేహాలను జిల్లా హాస్పిటల్స్ కు తరలించారు.