సోషల్ మీడియా సెల్ఫీ క్వీన్..సెల్ఫీ తీసుకుంటూనే పోయింది.

బికిని ధరించి పర్వతాల అంచులో నిలబడి సెల్పీ తీసుకుంటూ సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తూ సెలబ్రిటీగా మారిన తైవాన్ లోని న్యూ తైపీ సిటీకి చెందిన గిగి వూ చివరకు సెల్పీ తీసుకుంటూనే ప్రమాదవ శాత్తూ పర్వతంపై నుంచి కిందపడి చనిపోయింది. తైవాన్ లోని యుషాన్ నేషనల్ పార్క్ లోని ఎత్తైన పర్వతంపై అంచున నిలబడి సెల్ఫీ తీసుకొంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ జారి 65-100 అడుగుల లోయలోకి పడిపోయినట్లుశనివారం(జనవరి 19,2018) వూ తన స్నేహితులకు ఓ శాటిలైట్ ఫోన్ ద్వారా తెలియజేసిందని, అంత ఎత్తు నుంచి కిందకు పడిపోవడంతో ఆమె కదల్లేని స్థితిలో ఉండి, తాను తీవ్రంగా గాయపడినట్లు తన స్నేహితులకు వూ సమాచారమిచ్చిందని అధికారులు తెలిపారు.
సోమవారం రెస్కూ బృందాలు హెలికాఫ్టర్ ల ద్వారా ఆమె పడిపోయన ప్రదేశానికి చేరుకొనేందుకు ప్రయత్నించాయని కానీ పర్వతాల దగ్గర వాతావరణ స్థితి బాగోలేని కారణంగా హెలికాఫ్టర్లు ఆమె పడిపోయి ఉన్న ప్రదేశానికి చేరుకోవడం చాలా కష్టమైందని, ఆమె మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ లు గుర్తించాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పర్వతాల దగ్గర వెదర్ కండీషన్ బాగోలేదని, వాతావరణ పరిస్థితి మెరుగైన వెంటనే రెస్క్యూ బృందాలు డెడ్ బాడీని హెలికాఫ్టర్ ద్వారా తీసుకువస్తామని అధికారులు తెలిపారు.