స్నానం చేస్తున్న అమ్మాయిలు, వివాహితుల ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్.. వికారాబాద్ లో దారుణం

blackmail girls married woman: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని గిరిజన తండాలో దారుణం జరిగింది. స్నానం చేస్తున్న అమ్మాయిలు, వివాహితుల ఫోటోలు తీసి బెదిరించి.. లోబరుచుకున్నాడో కామాంధుడు. వాళ్లతో గడిపిన సన్నివేశాలను రికార్డు చేసి.. ఆ వీడియోలను స్నేహితులకు చూపించాడు. వారిలో ఓ వ్యక్తి శ్రీనివాస్ వీడియోను రికార్డు చేశాడు.
ఈ విషయం బాధిత మహిళల వరకూ వెళ్లడంతో.. వారి కుటుంబసభ్యులు శ్రీనివాస్‌ను నిలదీశారు. అయితే శ్రీనివాస్ ఎదురుతిరిగాడు. బాధిత మహిళ తమ్ముడిపై దారుణంగా దాడి చేశాడు. శ్రీనివాస్ దాడి చేస్తున్న దృశ్యాలను గ్రామస్థులు రికార్డు చేశారు. శ్రీనివాస్ దెబ్బలు తాళలేక ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడు. శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.