Andhra Pradesh : డబ్బుల కోసం కిడ్నాపర్స్‌తో చేతులు కలిపి 8 ఏళ్ల మేనల్లుడిని హత్య చేసిన మహిళ

తిరుపతిలోని వరదయ్యపాలెం మండలం కాంబాకం గ్రామంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బుల కోసం ఓ మహిళ చిన్నపిల్లాడ్ని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Andhra Pradesh : డబ్బుల కోసం కిడ్నాపర్స్‌తో చేతులు కలిపి 8 ఏళ్ల మేనల్లుడిని హత్య చేసిన మహిళ

Updated On : December 19, 2023 / 11:06 AM IST

Andhra Pradesh Crime : తిరుపతిలోని వరదయ్యపాలెం మండలం కాంబాకం గ్రామంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బుల కోసం ఓ మహిళ దారుణానికి దిగజారింది. చిన్నపిల్లాడ్ని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాతో కలిసి ఓ మహిళ తన మేనల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేసింది. ఇంతటి దారుణానికి పాల్పడటానికి కారణం డబ్బుల మీదున్న అత్యాశేనని తేలింది.

రేఖ అనే మహిళ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఎనిమిదేళ్ల హనీశ్ అనే బాలుడ్ని కిడ్నాప్ చేసింది. రూ.25 లక్షల కోసం చిన్నారులను కిడ్నాప్ చేసే ముఠాతో చేతులు కలిపి తన సొంత మేనల్లుడైన ఎనిమిదేళ్ల హనీశ్ ను అపహరించి తిరుపతి జిల్లా తీసుకొచ్చింది.  అక్కడ హనీశ్ ను చంపి ఓ గోనె సంచిలో మూట కట్టి ముళ్లపొదల్లో పడేసింది.

స్థానికులు ముళ్లపొదల్లో పడి ఉన్న గోనెసంచి మూటను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మూటను విప్పి చూడగా బాలుడి మృతదేహం కనిపించింది.దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఈ దారుణానికి ఒడిగట్టింది రేఖ అనే మహిళ అని గుర్తించారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు.