బాలుడి ప్రాణం తీసిన లిఫ్ట్

  • Published By: veegamteam ,Published On : November 24, 2019 / 03:19 PM IST
బాలుడి ప్రాణం తీసిన లిఫ్ట్

Updated On : November 24, 2019 / 3:19 PM IST

హైదరాబాద్‌లో మరో బాలుడిని లిఫ్ట్ బలి తీసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచవటి కాలనీలో లిఫ్ట్ కింద పడి తొమ్మిదేళ్ల ధనుష్‌ మృతి చెందాడు. రోడ్ నెంబర్ 10 టీవీఎస్‌ లేక్‌ వ్యూ అపార్ట్ మెంట్‌లోని మూడో అంతస్తులో ధనుష్ కుటుంబం నివాసం ఉంటోంది.

ఫ్లోర్‌లోని లిఫ్ట్ డోర్ తెరిచి ఉండడంతో.. ఒక్కసారిగా అందులో అడుగుపెట్టి కిందకు పడిపోయాడు ధనుష్‌. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ధనుష్ ప్రాణం కోల్పోవడంతో.. అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.