కార్ఖానాలో విషాదం : పాతభవనం కూల్చివేత..కూలి మృతి

పురాతన భవనాన్న కూల్చివేస్తున్నారు. అది కూడా మెయిన్ రోడ్డు. కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటిది తీసుకొనలేదని అనిపిస్తోంది. ఎందుకంటే కూల్చివేతల్లో ఓ కూలి చనిపోయాడు. ఈ విషాద ఘటన సికింద్రాబాద్ కార్ఖానాలో చోటు చేసుకుంది. రాత్రి సమయంలో కూల్చివేతలు చేపట్టారు. విషయం తెలుసుకున్న GHMC రెస్క్యూటీం అక్కడకు చేరుకుంది. సహాయక చర్యలు చేపట్టింది.
వివరాల్లోకి వెళితే..సికింద్రాబాద్ పరిధిలోని కార్ఖానాలో ఓ ప్రముఖ హోటల్ పక్కనే ఓ పురాతన భవనం ఉంది. దీనిని 2020, మార్చి 15వ తేదీ రాత్రి కూల్చివేతలను స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే..భవన గోడలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. రోడ్డుపై శిథిలాలు పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఓ కూలి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్‌ఎంసీ రెస్క్యూటీమ్ సహాయక చర్యలు చేపట్టారు.
శిధిలాలను తొలగించారు. శిథిలాల కింద చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసి.. గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అయితే జీహెచ్‌ఎంసీ అనుమతి లేకుండానే భవన యజమాని కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తోంది. పాత భవనాన్ని కూల్చివేసి.. కొత్త భవన నిర్మాణం కోసం కూడా పక్కనే పనులు ప్రారంభించారు. అయితే పాత భవనాన్ని కూల్చివేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read | కరోనా కొత్తేమీ కాదు, ప్రాణహాని లేదు