రూ.50కోట్లు ఇచ్చాకే అంత్యక్రియలు, అనంతపురం జిల్లాలో వివాదానికి దారితీసిన వ్యాపారి అంతిమ సంస్కారాలు

  • Published By: naveen ,Published On : November 17, 2020 / 05:43 PM IST
రూ.50కోట్లు ఇచ్చాకే అంత్యక్రియలు, అనంతపురం జిల్లాలో వివాదానికి దారితీసిన వ్యాపారి అంతిమ సంస్కారాలు

Updated On : November 17, 2020 / 6:20 PM IST

business man funeral: అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ బడా వ్యాపారి అంత్యక్రియలు వివాదాస్పదమయ్యాయి. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం రామదుర్గానికి చెందిన ప్రహ్లాద శెట్టి.. గుంతకల్లులో స్థిరపడి పెద్దఎత్తున శనగల వ్యాపారం చేసేవాడు. పెద్ద వ్యాపారవేత్త కదా.. అనే ఉద్దేశంతో పలువురు అతనికి కోట్లలో అప్పులిచ్చారు. కొంతకాంల క్రితం 50 కోట్ల రూపాయలకు ఐపీ పెట్టిన ప్రహ్లాద్‌ శెట్టి ఇల్లు విడిచి పరారయ్యాడు.


https://10tv.in/police-found-illegal-weapons-in-chittoor-district/
అయితే ఇప్పుడు ఆయన చనిపోవడంతో కుటుంబసభ్యులు అతడి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. స్తానికులు అడ్డుకున్నారు. తమకు అప్పు చెల్లించిన తర్వాతే అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవాలంటూ భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు… స్థానికులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసారు.