జూబ్లీహిల్స్‌లో బీభత్సం : విద్యుత్ స్తంభంపైకి ఎక్కిన కారు

  • Published By: madhu ,Published On : May 9, 2019 / 01:09 AM IST
జూబ్లీహిల్స్‌లో బీభత్సం : విద్యుత్ స్తంభంపైకి ఎక్కిన కారు

Updated On : May 9, 2019 / 1:09 AM IST

మద్యం మత్తులో వాహనాలు నడుపవద్దు..ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు..అని పోలీసులు మొత్తుకుంటున్నా..కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. విపరీతమైన వేగంతో ప్రయాణీస్తూ ప్రమాదాలకు కారణమౌతున్నారు. ఆక్సిడెంట్‌లలో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నా ఫలితం కనబడడం లేదు. తాజాగా మరో ప్రమాదం జరిగింది. 

జూబ్లీహిల్స్‌ పీఎస్‌ పరిధిలో మే 08వ తేదీ బుధవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఫిలింనగర్ నుంచి జూబ్లీహిల్స్ వైపు వెళ్తున్న కారు.. అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో అతివేగంతో ప్రయాణిస్తుండటంతో.. కారు విద్యుత్ స్తంభంపైకి ఎక్కింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యంమత్తులో డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు.