నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం.. ఒకరు మృతి

నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం తెల్లవారు జామున అత్యంత వేగంగా వచ్చినకారు ...

నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం.. ఒకరు మృతి

Updated On : February 20, 2024 / 11:29 AM IST

Road Accident : నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం తెల్లవారు జామున వేగంగా వచ్చినకారు ఔటర్ రింగ్ రోడ్డుపై నుండి కిండపడి అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది. ప్రమాదం సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు. వీరిలో ఒకరు మరణించగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Also Read : Road Accident : ఎల్బీన‌గ‌ర్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఎక్సైజ్ సీఐ మృతి, ఎస్ఐకు తీవ్ర గాయాలు

ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో ప్రయాణిస్తుంది అందరూ యువకులే. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం సేవించి కారు డ్రైవ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు గుర్తించారు. కారు డ్రైవింగ్ చేసిన మదన్ డ్రైవర్ కం ఓనర్. కారు ప్రమాదం సమయంలో 170 స్పీడ్ వేగంతో వెళ్తుంది. మద్యం సేవించి కారు ప్రమాదానికి కారకుడైన మదన్ పోలీసులు అదుపులో ఉన్నాడు.

Also Read : ఎద్దు కారణంగా ఆగిపోయిన మ్యాచ్.. అది గ్రౌండ్‌లోకి వచ్చి ఏం చేసిందో తెలుసా? వీడియో వైరల్

రాత్రి స్నేహితులంతా కలిసి లింగంపల్లిలోని నల్గండల్ వద్ద పార్టీకి వెళ్లారు. నల్గండల్ నుంచి ఇస్నాపూర్ వెళ్లిన స్నేహితులు.. మద్యం సేవించిన అనంతరం పఠాన్ చెరు ఓఆర్ఆర్ వైపు వెళ్లారు. కారు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వంశీ (26) గా పోలీసులు గుర్తించారు. మధన్ కారు ఓనర్. గాయాలైన వారిలో సాయి కిరణ్, శ్రీశైలం, చందక రాములు ఉన్నారు.