Road Accident : ఎల్బీన‌గ‌ర్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఎక్సైజ్ సీఐ మృతి, ఎస్ఐకు తీవ్ర గాయాలు

ఎల్బీ నగర్ లో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వచ్చిన కారు.. బైక్ పై వెళ్తున్న ఎక్సైజ్ సీఐ, ఎస్ఐలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న..

Road Accident : ఎల్బీన‌గ‌ర్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఎక్సైజ్ సీఐ మృతి, ఎస్ఐకు తీవ్ర గాయాలు

Road Accident

Updated On : February 14, 2024 / 8:58 AM IST

LB Nagar Road Accident : ఎల్బీ నగర్ లో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వచ్చిన కారు.. బైక్ పై వెళ్తున్న ఎక్సైజ్ సీఐ, ఎస్ఐలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న చార్మినార్ ఎక్సైజ్ సీఐగా విధులు నిర్వహిస్తున్న సాధిక్ అలీ మృతి చెందాడు. బైక్ పై వెనుక కూర్చున్న నారాయణగూడా ఎక్సైజ్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కాజావల్లి మోహినుద్దీన్ కు తీవ్ర గాయాలయ్యాయి. సీఐ సాధిక్ అలీ, ఎస్ఐ కాజావల్లి మోహినుద్దీన్ మలక్ పేట్ లోని ప్రభుత్వ క్వార్టర్స్ లో ఉంటున్నారు. ఎల్బీ నగర్ లో ఓ ఫంక్షన్ కు వెళ్లి మలక్ పేట్ లోని క్వార్టర్స్ కు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Also Read : Road Safety : వణుకు పుట్టించే వీడియో షేర్ చేసిన వీసీ సజ్జనార్.. కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్త..

ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎల్బీ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదం కారుపై ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయి. వినుషా శెట్టి పేరుపై కారు రిజిస్ట్రేషన్ అయ్యి ఉందని పోలీసులు గుర్తించారు. కారుపై ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ చలాన్లు ఉన్నాయి. అర్థరాత్రి ప్రమాదం తరువాత కారు నడిపిన వ్యక్తి కారును స్పాట్ లోనే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కారు ఏ ఏరియాకు సంబంధించింది? కారు నడిపింది ఎవరు అనే విషయాలపై దృష్టిపెట్టారు.