ఎద్దు కారణంగా ఆగిపోయిన మ్యాచ్.. అది గ్రౌండ్‌లోకి వచ్చి ఏం చేసిందో తెలుసా? వీడియో వైరల్

ఎద్దు కారణంగా మ్యాచ్ ఆగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు

ఎద్దు కారణంగా ఆగిపోయిన మ్యాచ్.. అది గ్రౌండ్‌లోకి వచ్చి ఏం చేసిందో తెలుసా? వీడియో వైరల్

local tennis ball cricket

Bull Enters in Cricket Ground : క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఓ ఎద్దు మైదానంలోకి వచ్చింది. దాన్ని తరిమేందుకు ప్లేయర్స్ ప్రయత్నించగా అది ఒక్కసారిగా వారిపైకి దూసుకెళ్లింది. దీంతో వారు భయాందోళనతో పరుగులు తీశారు. అయినా ఆ ఎద్దు వారిని వదలకుండా గ్రౌండ్ బయటకు పరుగు పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫన్నీ ఘటన ఏ ప్రాంతంలో జరిగిందనేది క్లారిటీ లేకపోయినా.. ఇది ఓ గ్రామంలో జరిగిన ఘటనగా వీడియో చూస్తే అర్థమవుతుంది.

Also Read : ఉత్తర కొరియా అధినేత కిమ్‌కు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ప్రత్యేక బహుమతి.. అదేంటో తెలుసా?

ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేసిన వీడియో ప్రకారం.. ఓ గ్రామంలో చిన్నపాటి మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఒక ఎద్దు వికెట్ల వైపుకు వస్తున్నట్లు చూడొచ్చు. ముందుగా వికెట్ కీపర్ వైపు ఆ ఎద్దు వెళ్లింది. అదిచూసిన వికెట్ కీపర్ వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టారు. దీని తరువాత స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ తన బ్యాట్ ను చూపిస్తూ ఎద్దును తరిమికొట్టడానికి ప్రయత్నించాడు. ఎద్దుకు కోపం వచ్చినట్లుంది.. సదరు బ్యాటర్ పైకి దూసుకెళ్లింది. ఆ తరువాత అంపైర్, బౌలర్ వైపు ఎద్దు దూసుకెళ్లడంతో ఇద్దరూ మైదానం నుంచి పరుగుపెట్టుకుంటూ బయటకు వెళ్లిపోయారు.

ఎద్దు కారణంగా మ్యాచ్ ఆగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఎద్దు కూడా క్రికెట్ ఆడేందుకు వచ్చిందేమో అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.