Road Accident : కుక్కను తప్పించబోయి బోల్తా పడిన కారు

అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ రోడ్డుపక్కన ఉన్నగులాబీతోటలోకి దూసుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్  వద్ద జరిగింది. 

Road Accident : కుక్కను తప్పించబోయి బోల్తా పడిన కారు

Road Accident

Updated On : January 7, 2022 / 3:02 PM IST

Road Accident : అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ రోడ్డుపక్కన ఉన్నగులాబీతోటలోకి దూసుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్  వద్ద జరిగింది.  మర్తుజాగూడ సమీపంలోని అమ్డాపూర్ లోడ్డులో ఐదుగురు మెడికోలు  గురువారం  ఒకకారులో వెళ్తున్నారు. కారు అతివేగంగా ఉంది.

ఆ సమయంలో రోడ్డుకు అడ్డంగా ఒక కుక్క రోడ్డు దాటసాగింది. కుక్కను తప్పించబోయి, కారు  కుక్కను ఢీకొట్టింది. కారును  అదుపుచేసే క్రమంలో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే ఆరడుగుల లోతులో ఉన్న గులాబీ తోటలోకి   దూసుకు వెళ్లింది.

కారులో ఉన్న ఐదుగురు వైద్య విద్యార్ధులకు గాయాలయ్యాయి. స్ధానికుల సహకారంతో వారిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నారు.