వితంతువుపై అత్యాచారం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • Published By: chvmurthy ,Published On : April 20, 2019 / 04:45 AM IST
వితంతువుపై అత్యాచారం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Updated On : April 20, 2019 / 4:45 AM IST

రాజస్ధాన్: వితంతువుపై అత్యాచారం చేసిన ఘటనలో రాజస్ధాన్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేపై  సీబీసీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. రాజ్ఘడ్ శాసన సభ స్దానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే 77 ఏళ్ళ  జోహారీ లాల్ మీనా, నియోజక వర్గంలోని ఒక వింతతువు పై పలుమార్లు అత్యాచారం చేసాడనే ఆరోపణలతో ఐపీసీ 376  కింద కేసు నమోదు చేశారు.  బాధిత మహిళ.. ఎమ్మెల్యేను  రేండేళ్ళ క్రితం ఒకసారి కలిసింది.  ఆ తర్వాత ఎమ్మెల్యే ఆమె ఇంటికి పలుమార్లు వచ్చి అత్యాచారం చేశాడని స్ధానిక కోర్టులో బాధితురాలు క్రిమినల్  కేసు పెట్టారు.

బాధిత వితంతువుకు ఆరోగ్యం బాగోలేక పోతే ఆస్పత్రికి తీసుకువెళతానని చెప్పి మెహందీపూర్ బాలాజీ పట్టణానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెకు కొన్ని మందులు ఇచ్చి స్పృహ కోల్పోయాక  ఆమె పై తిరిగి అత్యాచారం చేశాడు. అత్యాచారాన్ని వీడియో తీసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కోన్నారు. 2019,మార్చి 24వ తేదీన మళ్లీ తన ఇంటికి వచ్చి ఎమ్మెల్యే మీనా తనపై అత్యాచారం చేశాడని బాధిత వితంతువు ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టు ఆదేశాలతో సీబీసీఐడీ అధికారులు నిందితుడైన ఎమ్మెల్యే మీనాపై ఐపీసీ 328, 384, 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.