Madhya Pradesh : లోకాయుక్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన అధికారి…లంచం డబ్బు నమిలి మింగేశాడు
లంచం డబ్బు తీసుకుంటూ లోకాయుక్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఓ ఉద్యోగి దాన్ని నమిలి మింగేసిన ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. మింగేసిన లంచం నోట్లను వైద్యులు తిరిగి కక్కించారు...

Patwari Gajendra Singh
Madhya Pradesh : లంచం డబ్బు తీసుకుంటూ లోకాయుక్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఓ ఉద్యోగి దాన్ని నమిలి మింగేసిన ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ జిల్లాలోని రెవెన్యూ విభాగానికి చెందిన పట్వారీ గజేంద్రసింగ్ ఓ భూమి కేసులో ఫిర్యాదుదారు చందన్ సింగ్ లోధి నుంచి రూ.5వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో లోధి జబల్ పూర్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.
Indian married woman Anju : పాక్ వెళ్లిన నా కుమార్తె మానసిక క్షోభకు గురైంది… అంజూ తండ్రి వెల్లడి
లోకాయుక్త అధికారులు విచారణ జరిపి బిల్హారీ గ్రామంలోని పట్వారీ గజేంద్రసింగ్ ప్రైవేటు కార్యాలయానికి చేరుకున్నారు. చందన్ సింగ్ నుంచి 4,500రూపాయలను లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. (Caught red-handed) అంంతలో పట్వారీ గజేంద్రసింగ్ లంచం డబ్బును నమిలి మింగేశాడు. (Madhya Pradesh official swallows Rs 5,000 bribe money)
MERS-Coronavirus : అబుదాబీలో ప్రాణాంతకమైన మెర్స్ కరోనావైరస్ పాజిటివ్ కేసు
దీంతో లోకాయుక్త అధికారులు లంచగొండి అధికారి అయిన పట్వారీని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు పట్వారీ నోటి నుంచి లంచం నోట్లను గుజ్జు రూపంలో కక్కించారు. నోట్ల గుజ్జును స్వాధీనం చేసుకొని లంచగొండి పట్వారీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ సంజయ్ సాహు చెప్పారు.