Chennai : వీడు మామూలోడు కాదు – భార్య బాగుపడమంది, పోకిరోడు పోలీసులా..

ఏదైనా పని చేయాలని ఓ భార్య తరచూ చెబుతుంటే..అతను భరించలేకపోయాడు. పని చేయాల్సింది పోయి...అక్రమమార్గం ఎంచుకున్నాడు. నకిలీ పోలీసు అవతారం ఎత్తాడు. పలువురి వద్ద డబ్బులు వసూళ్లు చేశాడు. కానీ..ఇతని నాటకం ఎన్నో రోజులు నిలవలేదు.

Chennai : వీడు మామూలోడు కాదు – భార్య బాగుపడమంది, పోకిరోడు పోలీసులా..

Fake Police

Updated On : August 6, 2021 / 10:08 PM IST

Fake Police Officer : ఏం పని చేయకుండా ఉంటే ఎలా ? కుటుంబాన్ని నెట్టుకరావాలంటే…డబ్బులు కావాలి..కదా…ఏదైనా పని చేయాలని ఓ భార్య తరచూ చెబుతుంటే..అతను భరించలేకపోయాడు. పని చేయాల్సింది పోయి…అక్రమమార్గం ఎంచుకున్నాడు. నకిలీ పోలీసు అవతారం ఎత్తాడు. పలువురి వద్ద డబ్బులు వసూళ్లు చేశాడు. కానీ..ఇతని నాటకం ఎన్నో రోజులు నిలవలేదు. ఇతడిని పోలీసులు పట్టుకుని కటకటల్లోకి నెట్టారు. ఈ ఘటన చెన్నై నగరంలో చోటు చేసుకుంది.

Read More : Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను ఇలా కూడా వాడతారా.. ‘బుద్ధి లేదూ..!’

ఏదైనా పని చేయాలన్న భార్య : 
చెన్నైలో విజయన్ కుటుంబం నివాసం ఉంటోంది. ఎలాంటి పనులు చేయకుండా ఇంట్లో ఉన్న ఇతడిని ఏదైనా పని చేయాలంటూ..భర్త చెబుతుండేది. దీంతో ఇంట్లో తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. సంపాదన లేదని తరచూ భార్య గొడవ పడుతుండడంతో ఏకంగా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అవతారం ఎత్తాడు. ఇందుకు కావాల్సిన అన్ని సిద్ధం చేసుకున్నాడు. గ్రూప్ 1 పాసై అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గా ఉద్యోగం పొందినట్లు నాటకం ఆడాడు.

Read More : Ram Gopal Varma : రితేష్ – జెనీలియా జంటపై ఆర్జీవీ కామెంట్..

నకిలీ పోలీస్ అవతారం :
ఓ స్నేహితురాలి సహాయంతో సైరన్ తో కూడిన పోలీస్ జీప్ కూడా కొనుగోలు చేశాడు. తాను పోలీసు అధికారినంటూ..ప్రచారం చేసుకున్నాడు. అనంతరం పలువురి వద్ద డబ్బులు వసూళ్లు చేయడం స్టార్ట్ చేయసాగాడు. దిండుగల్లు జిల్లా లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ సమయంలో..ఆ ప్రాంతం గుండా…కమిషనర్ గెటప్ లో వెళుతున్నాడు విజయన్.

Chandrababu Pinrayi Vijayan

Chandrababu Pinrayi Vijayan

Read More : India-China Disengage In Gogra : భారత్ పట్టుతో వెనక్కి తగ్గిన చైనా..గోగ్రాలో దళాల ఉపసంహరణ

నిజం బయటపడింది :
అనుమానం వచ్చిన పోలీసులు..ఆ వాహనాన్ని తనిఖీ చేశారు. అసలు నిజం బయటపడింది. నిందితుని నుంచి వాహనం, నకిలీ ఐడీ కార్డు, యూనిఫాం, తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇది వరకు లారీ వ్యాపారంతో పాటు ఓ లోకల్ ఛానల్‌‌లో రిపోర్టర్ గా విజయన్ పనిచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Meeting With Kiran Bedi

Meeting With Kiran Bedi

Read More : Old Woman World Record : 100 ఏళ్ల బామ్మ వెయిట్‌లిఫ్టింగ్ లో గిన్నిస్ రికార్డ్..తగ్గేదేలేదంటున్న సెంచరీ నారీ

భార్య నిలదీయడంతోనే : 
తమిళ లోకల్ ఛానల్ విలేఖరిగా పని చేస్తున్న సమయంలో…తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులతో దిగిన ఫొటోలు చూపి అందర్నీ పోలీస్ అని నమ్మించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం విజయన్ ను కూడా కలిశాడు. ఏ పని చేయకుండా ఉంటే ఎలా అని భార్య తరచూ నిలదీయడంతో ఆ వేధింపులు భరించలేక పోలీసు అవతారం ఎత్తానని విజయన్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.

Meeting With Kiran Bedi

Meeting With Kiran Bedi