Massage Centres Seized : మసాజ్ సెంటర్ల‌లో వ్యభిచారం…8 మంది యువతులకు విముక్తి

తమిళనాడులోని చెన్నైలో మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు గత రెండురోజులుగా దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న 63 మసాజ్

Massage Centres Seized : మసాజ్ సెంటర్ల‌లో వ్యభిచారం…8 మంది యువతులకు విముక్తి

Brothels Arrested In Chennai

Updated On : November 23, 2021 / 8:53 AM IST

Massage Centres Seized :  తమిళనాడులోని చెన్నైలో మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు గత రెండురోజులుగా దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న 63 మసాజ్ సెంటర్లకు సీల్ వేశారు.

8  మసాజ్ సెంటర్లలో  వివిధ ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి  వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అదే సమయంలో మసాజ్ సెంటర్ల నుంచి లంచాలు తీసుకుంటున్న ఇద్దరు ఎస్సైలను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.  వీరిద్దరూ వ్యభిచార నియంత్రణ విభాగంలో పని చేస్తూ స్పా సెంటర్లు, మసాజ్ సెంటర్లు, స్టార్ హోటళ్ల వారి వద్ద నుంచి లక్షల్లో లంచాలు తీసుకుంటున్నట్లు గుర్తించారు.

Also Read : Hawala Cash Seized : నార్సింగి వద్ద కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

రెండు రోజులుగా జరుగుతన్న పోలీసు  దాడుల్లో  8 మంది మహిళలకు విముక్తి కల్పించి, మసాజ్ సెంటర్ల  నిర్వాహకులను అదుపులోకి  తీసుకున్నారు.  చెన్నైలో 151 మసాజ్ సెంటర్లు, స్పా సెంటర్లు ఉండగా వీటిలో 63 సెంటర్లకు అనుమతులు లేవని తేలటంతో వాటికి పోలీసులు సీల్ వేశారు.  పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.