కొట్టి చంపేశారు : పౌర సరఫరాల శాఖ ఏపీఆర్వో దారుణ హత్య

కర్నూలు జిల్లా ఆదోనిలో పౌర సంబంధాల శాఖ ఏపీఆర్వోను దుండగులు హత్య చేశారు.

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 07:08 AM IST
కొట్టి చంపేశారు : పౌర సరఫరాల శాఖ ఏపీఆర్వో దారుణ హత్య

Updated On : March 9, 2019 / 7:08 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో పౌర సంబంధాల శాఖ ఏపీఆర్వోను దుండగులు హత్య చేశారు.

కర్నూలు : జిల్లాలోని ఆదోనిలో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ అధికారి హత్య గావించబడ్డారు. పౌర సంబంధాల శాఖ ఏపీఆర్వోను దుండగులు దారుణంగా హత్య చేశారు. మృతుడు కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
Read Also : చెక్ ఇట్ : NTRO టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రారంభం

పోలీసుల కథనం ప్రకారం…కడప జిల్లాకు చెందిన సాయిబాబా కర్నూలు జిల్లా పౌర సరఫరాల శాఖ ఆదోని డివిజన్ ఏపీఆర్వోగా పని చేస్తున్నారు. నిన్న రాత్రి కార్యాలయం వద్ద అతనిపై దుండగులు కత్తులతో దాడి చేసి చంపినట్లు సమాచారం. ఈఘటనతో అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. ఏపీఆర్వోను హత్య చేయాల్సిన అవసరం ఏముందని తోటి ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అర్ధరాత్రి పూట అక్కడ ఇతరులకు ఏం పని.. అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది… ఒక ప్రజా సంబంధాల అధికారిపైన దాడి చేసి దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏముంది.. అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని ఆదోని డీఎస్పీ తెలిపారు.
Read Also : ఎలక్షన్ ఫీవర్ : జగన్ పార్టీలో చేరిన దాడి వీరభద్రరావు