Rajasthan DSP : దళితుడిపై మూత్రం పోసి .. ఎమ్మెల్యే బూట్లు నాకించిన రాజస్థాన్‌ డీఎస్పీ

సాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటి పోయింది. కానీ ఈనాటికి అణగారిన వర్గాలపై అత్యంత అమానవీయ దారుణాలు జరుగుతునే ఉన్నాయి. దళితులపై దారుణాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఓ దళితుడిపై దాష్టీకాన్ని చూపించింది ఖాకీ చొక్కా..

Rajasthan DSP : దళితుడిపై మూత్రం పోసి .. ఎమ్మెల్యే బూట్లు నాకించిన రాజస్థాన్‌ డీఎస్పీ

Rajasthan DSP Sivakumar Dalit man

Updated On : August 12, 2023 / 12:08 PM IST

Rajasthan DSP : సాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటి పోయింది. కానీ ఈనాటికి భారత్ లో అణగారిన వర్గాలపై అత్యంత అమానవీయ దారుణాలు జరుగుతునే ఉన్నాయి. పేదవారు పెత్తందారుల మధ్య తేడాలు మాత్రం పెరుగుతునే ఉన్నాయి. విదేశీల నుంచి దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది గానీ..స్వదేశీయుల చేతుల్లో ఘోర అవమానాలు పడుతునే ఉన్నాయి అణగారిని వర్గాలు. దళితులపై దురాగతాలు కొనసాగుతునే ఉన్నాయి. 51 ఏళ్ల వయస్సున్న ఓ దళితుడిపై దాష్టీకాన్ని చూపించింది ఖాకీ చొక్కా..

బలహీనలను అండగా ఉండాల్సిన పోలీసు అధికారి..ఓ దళితుడితో రాజకీయ నేతల బూట్లు నాకించిన అత్యంత అమానవీయ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఓ ఐపీఎస్ అధికారి దళితుడిపై మూత్రం పోసి దళితుడితో ఎమ్మెల్యే బూట్లు నాకించిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ (Rajasthan)డీఎస్పీ తనపై మూత్ర విసర్జన చేసి తనను ఈడ్చుకెళ్లి కాంగ్రస్ ఎమ్మెల్యే గోపాల్ మీనా బూట్లు నాకించారు అంటూ 51 ఏళ్ల దళితుడు ఫిర్యాదు చేశాడు.

Listen To Muslim Mann Ki Baat : మోదీజీ..ముస్లింల మన్ కీ బాత్ వినండి .. ప్రధానికి ముస్లిం మత పెద్ద సూచన

ఈ ఫిర్యాదు ప్రకారం..సదరు దళిత వ్యక్తిపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) శివకుమార్ భరద్వాజ తనపై దాడి చేసి పరుషపదజాలంతో దూషించి తనపై మూత్రవిసర్జన చేసి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గోపాల్‌ మీణా బూట్లు నాకించారు అంటూ బాధితుడు ఫిర్యాదు చేశాడు. జూన్ 30న ఈ ఘటన జరుగగా బాధితుడు పోలీసు అధికారి, ఎమ్మెల్యేల అంటే భయపడి ఊరుకున్నా.. జులై 27న అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటన జరిగిన రోజున తాను తన భార్యతో కలిసి పొలంలో పనిచేసుకుంటుండగా కొంతమంది పోలీసులు వచ్చి తనను ఈడ్చుకుపోయారని దారిలో కొట్టారని వాపోయాడు బాధితుడు. తనను పోలీసులు ఎమ్మెల్యే గోపాల్ మీనా ఇంటికి లాక్కెళ్లారని, అక్కడ డీఎస్పీ శివకుమార్‌ (DSP Sivakumar)తనపై మూత్రవిసర్జన చేసాడని..ఆ తరువాత ఎమ్మెల్యే బాట్లు నాకించారు అంటూ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నాడు.

తనపై దాడి చేసిన సమయంలో పోలీసు అధికారి ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఆ పొలంలో ఎలా పనిచేస్తావు..? అంటూ ఇష్టానుసారంగా అసభ్యంగా దూషించారని తెలిపి వాపోయాడు.తన ఫోన్ లాగేసుకుని ఈ విషయం ఎవరికైనా చెబితే ఇంతకుమించి జరుగుతుందని బెదిరించారంటూ పేర్కొన్నాడు. ఎఫ్‌ఐఆర్‌లో ఎమ్మెల్యే గోపాల్ మీనా(MLA Gopal Meena), డీఎస్పీ శివకుమార్ భరద్వాజ్ పేర్లను నిందితులుగా చేర్చారు.

కాగా సదరు బాధితుడి ఫిర్యాదు తీసుకోవాటానికి మొదట్లో పోలీసులు కూడా నిరాకరించారని..దీంతో తాను సీనియర్ అధికారులను సంప్రదించానని కానీ వారు కూడా తన బాధలు పట్టించుకోలేదని దీంతో తాను కోర్టును ఆశ్రయించటంతో కోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపాడు. తాను ఫిర్యాదు చేసినప్పటింనుంచి తనపై బెదిరింపులకు దిగుతున్నారని తెలిపాడు. ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CB-CID) చేత దర్యాప్తు చేయబడుతోంది.