కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

  • Published By: veegamteam ,Published On : March 5, 2020 / 11:47 AM IST
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

Updated On : March 5, 2020 / 11:47 AM IST

శంషాబాద్ లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో రేవంత్ రెడ్డిని నార్సింగ్ పోలీసులకు అరెస్టు చేశారు. కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫాంహౌస్ ను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డిని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫాంహౌస్ పై డ్రోన్ కెమెరాలు ఎగరవేశారన్న సమాచారంతో పోలీసులు ఆ డ్రోన్ కెమెరా ఎక్కడి నుంచి ఆపరేషన్ జరిగిందన్న కోణంలో మొదటగా ఐదుగురి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి సూచనల మేరకు అక్కడ డ్రోన్ కెమెరాలను ఎగరవేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. 

మొదటగా ఐదుగురిని అరెస్టు చేసి వారిని విచారించిన తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించారు. రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత డ్రోన్ కెమెరాల ఆపరేషన్ జరిగిందని స్పష్టమైన ఆధారాలు సేకరించిన తర్వాత కొద్ది సేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్ పోర్టులో నార్సింగ్ పోలీసులు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.