సీజ్ చేసిన SUVలో పోలీసుల జాయ్ రైడ్.. GPSతో కారు లాక్ చేసి 3 గంటలు చుక్కలు చూపించిన యజమాని!

తన కారును సీజ్ చేసిన పోలీసులకు మూడు గంటల పాటు చుక్కలు చూపించాడు ఆ కారు యజమాని. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV) కారును పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత ముగ్గురు పోలీసులు కలిసి ఖరీదైనా అదే కారులో రాత్రి పూట సరదాగా రైడ్‌కు వెళ్లారు. తన కారు లొకేషన్ గుర్తించిన కారు యజమాని ఖేరి జిల్లాలోని లక్మీపూర్‌లో GPS (గ్లోబల్ ఫోజిషినింగ్) స్టిస్టమ్ ద్వారా కార్ లాక్ చేశాడు. అప్పటివరకూ దూసుకెళ్లిన కారు ఒక్కసారిగా ఆగిపోవడంతో పోలీసులకు ఏం అర్థం కాలేదు. ఇంజిన్ ఆగిపోయింది. కారు డోర్లు ఓపెన్ కాలేదు.
ఏం జరిగిందో తెలియక ఆ పోలీసులు దాదాపు 3 గంటల పాటు అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాజధాని నుంచి 143 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేరి జిల్లాలో లకింపూర్, నాయ్ బస్తి గ్రామంలో తన కారును యజమాని గుర్తించాడు. అప్పటివరకూ ఆ ముగ్గురు పోలీసులు అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. పోలీసులు ముగ్గురిలో ఒకరు సబ్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు.
వీరంతా లక్నోలోని గోమతి నగర్ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్నారు. ఒక కేసును దర్యాప్తు నిమిత్తం ఈ ముగ్గురు లకింపూర్ ప్రాంతానికి 2018 SUV మోడల్ కారులో వెళ్లారు. అంతకుముందు రెండు పార్టీల మధ్య గొడవ జరిగిన సమయంలో పోలీసులు ఈ కారును మంగళవారం రాత్రి సీజ్ చేశారు. సీజింగ్ పేరుతో తన కారును పోలీసులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ వాహన యజమాని లక్నో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి SHO (స్టేషన్ హౌస్ ఆఫీసర్) గోమితినగర్, ప్రమేంద్ర కుమార్ సింగ్‌ను అక్కడికి పంపినట్టు లక్నో పోలీస్ కమిషనర్ సుజీత్ పాండే తెలిపారు. దోషులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాహనంలో ఏర్పాటు చేసిన GPS-ఎనేబుల్డ్ లాకింగ్ వ్యవస్థను వివరిస్తూ.. ఒక నిపుణుడు ఈ విధానం కార్ల భద్రతను నిర్ధారిస్తుందని చెప్పారు.
ఎవరైనా వాహన యజమాని తన కారు సురక్షితమైన లేదని భావిస్తే.. మైక్రో కంట్రోలర్‌కు ఒక మెసేజ్ పంపొచ్చు. అది ఇంజిన్‌ను ఆపడానికి సిగ్నల్‌లను పంపుతుంది. డోర్స్ కూడా లాక్ చేస్తుంది. కారు యజమాని పాస్‌వర్డ్‌ను మైక్రో కంట్రోలర్‌కు పంపిన తర్వాత మాత్రమే కారు మళ్లీ స్టార్ట్ అవుతుంది. అప్పటివరకూ కారు అక్కడే ఉండాల్సిందే.
See Also | ‘ఆటిజం’చిన్నారులకు స్కిల్ డెవలప్‌మెంట్ నేర్పుతున్న ‘పక్షి రోబో’