TV Blast : పీలేరులో టీవీ పేలి జవాను మృతి

సంక్రాంతి పండగ సెలవల కోసం ఇంటికొచ్చిన ఆర్మీ జవాన్ టీవీ పేలి కన్ను మూశాడు.

TV Blast : పీలేరులో టీవీ పేలి జవాను మృతి

Pileru tv blast

Updated On : January 10, 2022 / 12:04 PM IST

TV Blast :  చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సంక్రాంతి పండగ సెలవల కోసం ఇంటికొచ్చిన ఆర్మీ జవాన్ టీవీ పేలి కన్ను మూశాడు.  పీలేరు సైనిక్ నగర్ లో నివసించే నాగేశ్వర్ నాయక్ పండుగ సెలవలకోసం రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు.

ఈరోజు ఉదయం టీవీ చూస్తుండగా కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా టీవీ పేలి నాగేశ్వర్ మరణించాడు. అతని భార్య సిధ్దేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి.  ప్రస్తుతం ఆమె పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : Vanama Raghava : వనమా రాఘవపై 12 కేసులు-రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపిన పోలీసులు

ఆమెను  పీలేరు ప్రభుత్వాసుపత్రికి  తరలించారు. ఈఘటనతో సైనిక్‌నగర్‌లో  విషాధచాయలు అలుముకున్నాయి.  నాగేశ్వర్ నాయక్ సీఆర్పీఎఫ్ లో జవానుగా పని చేస్తున్నాడు.