వికారాబాద్ మణప్పురం గోల్డ్ లోన్ ఆఫీస్‌లో కలకలం.. 3 కేజీల బంగారం మాయం..! ఆందోళనలో కస్టమర్లు..

విషయం తెలిసిన వెంటనే బ్రాంచ్ దగ్గరికి వచ్చి ఆందోళనకు దిగారు కస్టమర్లు.

వికారాబాద్ మణప్పురం గోల్డ్ లోన్ ఆఫీస్‌లో కలకలం.. 3 కేజీల బంగారం మాయం..! ఆందోళనలో కస్టమర్లు..

Updated On : October 20, 2024 / 2:11 AM IST

Gold Missing : వికారాబాద్ మణప్పురం గోల్డ్ లోన్ ఆఫీస్ లో మేనేజర్ చేతివాటం ప్రదర్శించాడు. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని మేనేజర్ విశాల్ ఎత్తుకెళ్లాడు. సుమారు 3 కేజీల గోల్డ్ ను ఎత్తుకెళ్లినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కస్టమర్లు వికారాబాద్ బ్రాంచ్ కు చేరుకుని ఆందోళనకు దిగారు. తమ బంగారం ఏమైందంటూ సిబ్బందిని నిలదీశారు.

వికారాబాద్ టౌన్ లో మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. కస్టమర్లు తాకట్టు పెట్టిన గోల్డ్ ని మేనేజర్ మాయం చేయడంతో దుమారం రేగింది. బ్రాంచ్ వద్దకు చేరుకున్న కస్టమర్లు ఆందోళనకు దిగారు. సుమారు 3 కోట్ల రూపాయల విలువ చేసే మూడు కిలోల బంగారాన్ని సిబ్బందితో కలిసి మేనేజర్ మాయం చేసినట్లుగా తెలుస్తోంది.

మణప్పురం గోల్డ్ కు సంబంధించి ప్రతి రోజు ఓపెనింగ్స్ తో పాటు ఎండింగ్ సమయంలో లెక్కలు చూస్తుంటారు. శనివారం ఉదయం కూడా అదే విధంగా లాకర్లు ఓపెన్ చేసి గోల్డ్ లెక్కలు చూస్తూ ఒక్కసారిగా షాక్ తిన్నారు సిబ్బంది. సుమారు 3 కిలోల బంగారం మిస్ అయినట్లు గుర్తించారు. వెంటనే మేనేజర్ కు ఫోన్ చేసే ప్రయత్నం చేశారు. మేనేజర్ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో మరో సీనియర్ అధికారికి సమాచారం ఇచ్చారు. వికారాబాద్ మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్ మేనేజరే బంగారాన్ని తస్కరించినట్లుగా సిబ్బంది చెప్పడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

మణప్పురం గోల్డ్ లో తమ బంగారం తాకట్టు పెట్టిన కస్టమర్లు.. విషయం తెలిసిన వెంటనే బ్రాంచ్ దగ్గరికి వచ్చి ఆందోళనకు దిగారు. తమ గోల్డ్ తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది, కస్టమర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

 

Also Read : మూడు హత్యల కేసుల్లో నిందితుడు అరెస్ట్.. వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ