శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం స్వాధీనం

  • Published By: chvmurthy ,Published On : October 20, 2019 / 01:38 PM IST
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం స్వాధీనం

Updated On : October 20, 2019 / 1:38 PM IST

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.  విమానం దిగి ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురువ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద 915.17 గ్రాముల బంగారం లభించింది.

ఈ బంగారానికి సంబంధించి వారి వద్ద ఎటువంటి రసీదులు లేకపోవటంతో అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు. బంగారం విలువ 35లక్షల 50 వేల858 రూపాయలు ఉంటుందని అధికారులు చెప్పారు.