అమ్మాయి కోసం కక్కుర్తి పడ్డాడు, రూ.91వేలు పొగొట్టుకున్నాడు.. లాక్ డౌన్ లో సైబర్ మోసాలు

లాక్ డౌన్ వేళ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసాలకు తెగబడుతున్నారు. జస్ట్ ఒక్క క్లిక్ తో లక్షలు దోచుకుంటున్నారు. జనాల వీక్ నెస్ ను మంచిగా క్యాష్

అమ్మాయి కోసం కక్కుర్తి పడ్డాడు, రూ.91వేలు పొగొట్టుకున్నాడు.. లాక్ డౌన్ లో సైబర్ మోసాలు

Updated On : June 23, 2021 / 1:08 PM IST

లాక్ డౌన్ వేళ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసాలకు తెగబడుతున్నారు. జస్ట్ ఒక్క క్లిక్ తో లక్షలు దోచుకుంటున్నారు. జనాల వీక్ నెస్ ను మంచిగా క్యాష్

లాక్ డౌన్ వేళ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసాలకు తెగబడుతున్నారు. జస్ట్ ఒక్క క్లిక్ తో లక్షలు దోచుకుంటున్నారు. జనాల వీక్ నెస్ ను మంచిగా క్యాష్ చేసుకుంటున్నారు. నిన్నటికి నిన్న ఆన్ లైన్ లో మద్యం సరఫరా చేస్తామంటూ ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు రూ.3 లక్షలకుపైగా టోకారా వేసిన సైబర్ నేరగాళ్లు తాజాగా మరో మోసానికి ఒడిగట్టారు. ఈసారి అమ్మాయిల వీక్ నెస్ ఉన్న వ్యక్తిని దగా చేశారు. కావాల్సిన చోటికి అమ్మాయిల్ని పంపిస్తామంటూ ఘరానా మోసానికి తెగబడ్డారు.

మీకు అమ్మాయి కావాలంటే ఈ నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. గంటలో అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది అంటూ ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. ఇది చూసిన హైదరాబాద్ లోని బొల్లారం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కక్కుర్తి పడ్డాడు. ఆ నెంబర్ మెసేజ్ చేశాడు. అమ్మాయి అనుకుని చాటింగ్ చేశాడు. అంతేకాదు వారు పంపిన బ్యాంక్ అకౌంట్ కు రూ.91వేలు ట్రాన్సఫర్ కూడా చేశాడు. డబ్బులు అకౌంట్ లో జమకాగానే సైబర్ నేరగాళ్లు తమ మొబైల్ నెంబర్ ను బ్లాక్ చేశారు. ఆ నెంబర్ కు కాల్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో తాను మోసపోయాయని గ్రహించిన బాధితుడు లబోదిబోమన్నాడు. వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆన్‌లైన్ కేటుగాళ్ల ఉచ్చులో ప‌డ‌కుండా ఉండాలని పోలీసులు నెత్తీనోరు బాదుకుంటున్నారు. అపరిచితుల నుంచి వచ్చే మేసేజ్ లను, కాల్స్ ను ఇగ్నోర్ చేయాలని చెబుతున్నారు. అయినా మార్పు రావడం లేదు. చాలా మంది సైబర్ నేర‌గాళ్ల ఉచ్చులో ప‌డుతూనే ఉన్నారు. బ్యాంకు మోసాల ప‌ట్ల ప్రజ‌ల్లో అవగాహన పెరుగుతుండడంతో సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. జనాల వీక్ నెస్ లు తెలుసుకుని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. నిన్న మద్యం అన్నారు, నేడు అమ్మాయిల పేరిట వ‌ల విసురుతున్నారు.