ఉన్నావ్ లో మరో దారుణం…మూడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

  • Published By: venkaiahnaidu ,Published On : December 7, 2019 / 11:41 AM IST
ఉన్నావ్ లో మరో దారుణం…మూడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

Updated On : December 7, 2019 / 11:41 AM IST

ఓ వైపు ఉన్నావ్ బాధితురాలి మృతి పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సమయంలోనే ఉన్నావ్ జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉన్నావ్ జిల్లాలో జరిగింది.

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్ జిల్లాలోని మఖీ గ్రామంలోమూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అభం, శుభం తెలియని ఆ చిన్నారి శుక్రవారం ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా.. అదే వీధికి చెందిన యువకుడు ఆమెను పక్కన ఉన్న పొలంలోకి లాక్కెళ్లాడు. పాప అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని.. చిన్నారిని కాపాడారు. పారిపోయేందుకు ప్రయత్నించిన యువకుడుని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చిన్నారిని వైద్య పరీక్షలకు తరలించారు. యువకుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీస్ కస్టడీకి తరలించినట్లు ఎస్పీ విక్రాంత్ వీర్ తెలిపారు.

యూపీలో మహిళలు,చిన్నారులపై రోజురోజుకీ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని,యూపీలో మహిళలకు స్థానం లేకుండా చేస్తున్నారని యోగి సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ ను అధర్మప్రదేశ్ గా మార్చారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.