చిత్తూరులో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య : ప్రేమ వ్యవహారమే కారణమా?
చిత్తూరులో డిగ్రీ విద్యార్థిని ఫాతిమా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు.

చిత్తూరులో డిగ్రీ విద్యార్థిని ఫాతిమా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు.
చిత్తూరులో డిగ్రీ విద్యార్థిని ఫాతిమా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇబ్రహీం అనే పెళ్లైన యువకుడితో ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు. ఇబ్రహీంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మదనపల్లెలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రెండో శనివారం, ఆదివారం కావడంతో నిన్న సొంతూరు అయిన చిత్తూరుకు వచ్చింది.
నిన్న రాత్రి ఫాతిమా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫాతిమా మృతికి కారణాలపైన పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరులో ఉంటున్న ఇబ్రహీం అనే యువకుడిని ఫాతిమా ప్రేమించిన్నట్లు తెలుస్తోంది. కాగా ఇదివేరకే ఇబ్రహీం వివాహం అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా ఫాతిమా..ఇబ్రహీంతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది.
పెళ్లైన విషయం తెలిసే యువకుడిని ప్రేమిస్తుందా లేదా ఇబ్రహీం…ఫాతిమాను మోసం చేశాడా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఫాతిమా తల్లి దుబాయ్ లో ఉంటున్నారు. తండ్రి లేడని తెలుస్తోంది. అయితే ఇప్పటికే అనుమానితుడిగా ఉన్న ఇబ్రహీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫాతిమా కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.
నిన్న రాత్రి ఇంట్లో ఉరి వేసుకోబోయే ముందు కొంతమందితో ఫాతిమా మాట్లాడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి పోలీసులు యువతి కాల్ డేటాను తీసుకొని ఆత్మహత్య వెనుక ఇబ్రహీం ఉన్నాడా..మరేదైనా కారణముందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.