Delhi: టీచర్ అరాచకం.. 5వ క్లాస్ విద్యార్థినిపై కత్తెర్లతో దాడి చేసి, ఆపై బాల్కనీ నుంచి తోసేసింది
దేశ రాజధాని ఢిల్లీలో ఓ అరాచకం జరిగింది. తన వద్ద చదువుతున్న విద్యార్థినిపై టీచర్ దారుణానికి పాల్పడింది. 5వ తరగతి చదువుతున్న పసిపాపై కత్తర్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చడమే కాకుండా, ఆ బాలికను మొదటి అంతస్తులోని బాల్కనీ నుంచి కిందకు విసిరేసింది. ఢిల్లీలోని కరోట్ బాఘ్ ప్రాంతంలో శుక్రవారం జరిగిందీ సంఘటన. చిన్నారి పేరు వందన.

Delhi Teacher Attacks Class 5 Girl With Scissors, Throws Her Off Balcony
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఓ అరాచకం జరిగింది. తన వద్ద చదువుతున్న విద్యార్థినిపై టీచర్ దారుణానికి పాల్పడింది. 5వ తరగతి చదువుతున్న పసిపాపై కత్తర్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చడమే కాకుండా, ఆ బాలికను మొదటి అంతస్తులోని బాల్కనీ నుంచి కిందకు విసిరేసింది. ఢిల్లీలోని కరోట్ బాఘ్ ప్రాంతంలో శుక్రవారం జరిగిందీ సంఘటన. చిన్నారి పేరు వందన. తీవ్ర గాయాలతో ప్రస్తుతం అత్యంత ఆందోళనకర స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అలాగే ఈ దారుణానికి పాల్పడ్డ టీచర్ పేరు గీత. ఆమెను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ పాఠశాలలోని టీచర్లు విద్యార్థులను కొట్టడం మామూలేనని, ఇలాంటి క్రితం అనేకం జరిగాయని స్థానికులు పోలీసులకు తెలిపారు. అనేక మంది విద్యార్థులు ఇలా గాయపడ్డారని, కొన్నిసార్లు విద్యార్థుల తల్లిదండ్రులు గొడవ పడతారని, అయినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదని వారు పేర్కొన్నారు.