DRDO Missile Secrets : పాక్ మహిళా గూఢాచారిణికి క్షిపణి రహస్యాలు..డీఆర్‌డీఓ శాస్త్రవేత్తపై చార్జ్ షీట్

భారత క్షిపణి రహస్యాలను పాకిస్థాన్ మహిళా గూడాచారిణికి అందించిన కేసులో నిందితుడైన డీఆర్‌డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పై మహారాష్ట్రలోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది....

DRDO Missile Secrets : పాక్ మహిళా గూఢాచారిణికి క్షిపణి రహస్యాలు..డీఆర్‌డీఓ శాస్త్రవేత్తపై చార్జ్ షీట్

DRDO Scientist Attracted To Pak Spy Agent

DRDO Scientist chargesheet : భారత క్షిపణి రహస్యాలను పాకిస్థాన్ మహిళా గూడాచారిణికి అందించిన కేసులో నిందితుడైన డీఆర్‌డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పై మహారాష్ట్రలోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. (DRDO Scientist Attracted To Pak Spy Agent) పూణే నగరంలోని డీఆర్ డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ కు చెందిన మహిళా గూఢాచారిణి జరా దాస్ గుప్తాకు భారత క్షిపణి వ్యవస్థల గురించి ఛాటింగులో వెల్లడించాడని ఏటీఎస్ ఛార్జి షీట్ లో పేర్కొంది. (Revealed Missile Secrets)

వాట్సాప్, వాయిస్, వీడియో కాల్స్…

డీఆర్ డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ పాక్ గూఢాచారిణి జరాతో వాట్సాప్, వాయిస్, వీడియో కాల్ ల ద్వారా మాట్లాడడని ఏటీఎస్ వెల్లడించింది. భారత శాస్త్రవేత్త పాక్ మహిళా ఏజెంటు వైపు ఆకర్షితుడై క్షిపణి అధికారిక రహస్యాలను వెల్లడించాడని ఏటీఎస్ దర్యాప్తులో తేలింది. భారత శాస్త్రవేత్త ప్రదీప్ ను మహారాష్ట్ర ఏటీఎస్ మే 3వతేదీన గూఢచర్యం కేసులో అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

అసభ్యకర సందేశాలతో స్నేహం…

యూకేలో ఉంటున్న జరా దాస్‌గుప్తా తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని, అసభ్యకర సందేశాలు, వీడియోలు పంపుతూ భారత శాస్త్రవేత్తతో స్నేహం పెంచుకుందని విచారణలో వెల్లడైంది. కాగా ఆమె ఐపీ అడ్రస్ పాకిస్థాన్‌కు చెందినదని ఏటీఎస్ చార్జిషీట్‌లో పేర్కొంది. బ్రహ్మోస్ లాంచర్, డ్రోన్, యూసీయూ, అగ్ని క్షిపణి లాంచర్, మిలిటరీ బ్రిడ్జింగ్ సిస్టమ్‌కు సంబంధించిన రహస్య, సున్నితమైన సమాచారాన్ని పొందడానికి పాకిస్తాన్ ఏజెంట్ ప్రయత్నించిందని ఛార్జిషీటు పేర్కొంది.

పాక్ ఏజెంటుకు అధికారిక రహస్యాలు…

అరెస్టయిన డిఫెన్స్ సైంటిస్ట్ గతేడాది నుంచి పాక్ ఏజెంట్‌తో టచ్‌లో ఉన్నాడని తేలింది. శాస్త్రవేత్త ప్రదీప్ కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన తర్వాత డీఆర్ డీఓ అంతర్గత విచారణ ప్రారంభించింది. దీంతో ప్రదీప్ కురుల్కర్ ఫిబ్రవరి 2023 ఫిబ్రవరి నెలలో జారా నంబర్‌ను బ్లాక్ చేశాడు. చాట్ రికార్డులు, తన వ్యక్తిగత షెడ్యూళ్లు, లొకేషన్‌లను ఎవరితోనూ పంచుకోకూడదని తెలిసినప్పటికీ దాన్ని ఉల్లంఘించి భారత శాస్త్రవేత్త ప్రదీప్ పాక్ మహిళతో పంచుకున్నట్లు ఛార్జిషీట్ పేర్కొంది.