మీ పిల్లలు జాగ్రత్త : విజయవాడకు పాకిన మత్తు దందా
గంజాయి మత్తులో జోగుతున్న బెజవాడలోకి డ్రగ్స్ మాఫియా అడుగుపెట్టింది. మెట్రో పాలిటన్ సిటీస్ వరకే పరిమితమైందనుకున్న డ్రగ్స్ మాఫియా .. ఇప్పుడు తన వికృత వ్యాపారాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది.

గంజాయి మత్తులో జోగుతున్న బెజవాడలోకి డ్రగ్స్ మాఫియా అడుగుపెట్టింది. మెట్రో పాలిటన్ సిటీస్ వరకే పరిమితమైందనుకున్న డ్రగ్స్ మాఫియా .. ఇప్పుడు తన వికృత వ్యాపారాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది.
గంజాయి మత్తులో జోగుతున్న బెజవాడలోకి డ్రగ్స్ మాఫియా అడుగుపెట్టింది. మెట్రో పాలిటన్ సిటీస్ వరకే పరిమితమైందనుకున్న డ్రగ్స్ మాఫియా .. ఇప్పుడు తన వికృత వ్యాపారాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. తాజాగా.. ఉత్తరాది నుంచి హైదరాబాద్‌కు వ్యాపారాన్ని విస్తరించిన ఈ ముఠా.. విజయవాడలోనూ తన విక్రయాలను ప్రారంభించించి అడ్డంగా బుక్కయింది.
కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు నైజీరియన్లతోపాటు కానూరుకు చెందిన మరో వ్యక్తి ఓ ముఠాగా ఏర్పడి విజయవాడలో డ్రగ్స్ విక్రయిస్తున్నారు. బెంగళూరు, ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడి విద్యార్థులను మత్తుకు బానిసలను చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే.. దీనిపై పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 200 కిలోల గంజాయితోపాటు హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సాధారణంగా ఏపీ పోలీసు రికార్డుల్లోని డ్రగ్స్ జాబితాలోకి గంజాయి, బ్రౌన్ షుగర్ వంటివే తప్ప.. కొకైన్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలు చేరలేదు. అలాంటిది విజయవాడలో ఈ రేంజ్‌లో డ్రగ్స్ పట్టుబడటంతో పాటు వాటిని సరఫరా చేస్తున్న ముఠా కూడా పోలీసులకు చిక్కడం కలకలం రేపుతోంది.
విద్య పేరిట విదేశాల నుంచి వస్తున్న కొందరు.. కాసులకు కక్కుర్తిపడి మాదకద్రవ్యాల విక్రయాలతో జేబులు నింపుకుంటున్నారు. తాజాగా పట్టుబడిన నైజీరియన్లు కూడా.. విజయవాడలో తమ డ్రగ్స్ బిజినెస్‌ని డెవలప్ చేసేందుకే ఇక్కడ మకాం వేసినట్లు ప్రాధమిక సమాచారంగా తెలుస్తోంది. అయితే వీరి నుంచి కేవలం 14 గ్రాముల హెరాయిన్, 200కిలోల గంజాయి మాత్రమే దొరికినప్పటికీ.. అసలు విజయవాడలో ఈ మాదక ద్రవ్యాలు పట్టుబడటం ఇటు బెజవాడ వాసులనే కాదు అటు పోలీసులను కూడా ఉలికిపాటుకు గురి చేసింది.