Rape And Murder : శృంగార స్వామి…..వీడికి రోజుకో అమ్మాయి కావాలి
విలాసాలకు అలవాటు పడిన వ్యక్తి మహిళలను మాయమాటలతో లోబరుచుకునేవాడు. వాళ్లను శారీరకంగా అనుభవించాక వారి ఒంటి పైన ఉన్న ఆభరణాలతోపరారయ్యేవాడు. ఆభరణాలు అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాగా గడిపేవాడు. గత తొమ్మిదేళ్లుగా చేస్తున్ననేర చరిత్రకు ఇటీవల జరిగిన హత్యతో ప్రస్తుతం పోలీసులు చెక్ పెట్టారు.

Womaniser
Rape And Murder : విలాసాలకు అలవాటు పడిన వ్యక్తి మహిళలను మాయమాటలతో లోబరుచుకునేవాడు. వాళ్లను శారీరకంగా అనుభవించాక వారి ఒంటి పైన ఉన్న ఆభరణాలతోపరారయ్యేవాడు. ఆభరణాలు అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాగా గడిపేవాడు. గత తొమ్మిదేళ్లుగా చేస్తున్ననేర చరిత్రకు ఇటీవల జరిగిన హత్యతో ప్రస్తుతం పోలీసులు చెక్ పెట్టారు. జులై 25న దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు గురైన 37 మహిళ హత్యకేసులో పోలీసులు అరెస్ట్ చేసిన కిలాడీ జంట నేర చరిత్ర తవ్విన కొద్దీ విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి.
వికారాబాద్ కు చెందిన కురువస్వామి(32) ఐడీఏ బొల్లారం వైఎస్సార్ కాలనీలో నివాసం ఉంటూ డ్రైవర్ గా, కూలీగా పని చేస్తున్నాడు. 9 ఏళ్ల క్రితం పరిచయం అయిన మనసమొల్ల నర్సమ్మ(30)తో కొంతకాలం సహజీవనం చేసి అనంతరం పెళ్లి చేసుకున్నాడు. దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో హత్యకు గురైన భామిని హత్య కేసు విచారణలో భాగంగా పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ మహిళను హత్య చేసినట్లు నిందితులిద్దరూ ఒప్పుకున్నారు.

Dundigal Police Station Murder Case
స్వామి ఏ పనీ చేయడు… కానీ విలాసవంతమైన జీవితం కావాలి.. లేబర్ అడ్డాలు.. మార్కెట్ల దగ్గర అందంగా ఒంటిపై ఆభరణాలు ధరిచే మహిళలను తన మాటల మాయాజాలంతో ట్రాప్ లోకి దింపేవాడు. వాళ్లతో మాట్లాడే క్రమంలో సమీపంలోని నిర్మానుష్యంగా ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లేవాడు. అక్కడ వారిని నెమ్మదిగా మాటలతో లోబరుచుకుని శారీరకంగా అనుభవించేవాడు. అనంతరం వారి వద్ద ఉన్నబంగారు ఆభరణాలుతీసుకుని అక్కడి నుంచి పారిపోయేవాడు.
చేసినదే చెడ్డపని అవటంతో ఆ మహిళలు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేసేవారు కాదు. దీంతో స్వామి ఆడింది ఆట పాడింది పాటగా తయారయ్యింది. అదే క్రమంలో 9 ఏళ్లక్రితం నర్సమ్మను లోబర్చుకుని అత్యాచారం చేశాడు. కానీ మిగిలిన ఆడవాళ్ల లాగా నర్సమ్మ వదిలేసి వెళ్లిపోలేదు. స్వామితో స్నేహం కొనసాగించింది. నర్సమ్మకు అప్పటికే పెళ్లై భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా స్వామితో పరిచయం బాగా పెరగటంతో భర్త, పిల్లల్ని వదిసేలేసి స్వామితో సహజీవనం చేయటం ప్రారంభించింది. స్వామి చేసే పనికి సహకరించటం మొదలెట్టింది. కొన్నాళ్లకు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
స్వామి దొంగతనం చేసి తెచ్చిన సొమ్మును కుదువ పెట్టి ఆడబ్బుతో జల్సా చేయటం మొదలెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రతి రెండు నెలలకోసారి ఇల్లు మారేవారు. ఇంట్లో పెద్దగా సామాను ఏర్పాటు చేసుకోలేదు. పెళ్లైన తర్వాత నుంచి స్వామి ప్రవర్తనలో మార్పు రాసాగింది. నువ్వోకదానివే సరిపోవు…..నాకు రోజుకో అమ్మాయికావాలి… ఎవరినైనా తీసుకొస్తే తీసుకురా….. లేదంటే నిన్నువదిలేస్తా అంటూ బెదిరించాడు. తప్పనిసరి పరిస్ధితుల్లో స్వామి చేసే అఘాయిత్యాలకు సహకరించటం మొదలెట్టింది.
మహిళలను సమకూర్చటం మొదలెట్టింది. వారు ఒప్పుకుంటే లైంగిక దాడి చేసేవాడు, లేదంటే నరకం చూపించేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేయరనుకుంటే వదిలేసేవాడు. లేదు వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు అనుకుంటే వారిని కిరాతకంగా హత్యచేసేవాడు అని నర్సమ్మ విచారణలో పోలీసులకు వివరించింది. అందులో భాగంగానే ఈనెల 25న మల్లంపేట కూలీల అడ్డా వద్ద వీరిద్దరూ భామిని అనే మహిళా కూలీని గుర్తించారు. స్వామికి ఆమె నచ్చడంతో ఆమెను తీసుకు వెళ్లేందుకు నర్సమ్మతో పథకాన్ని చెప్పాడు.
నర్సమ్మ ప్లాన్ అమలు చేసింది.
అప్పటికే ఉదయం గం. 10.30 అవడంతో ఇక ఆరోజు పని దొరకదని భావించిన భామిని భర్త సోమనాథ్ ఆమెను ఇంటికి వచ్చేయమన్నాడు. కానీ, ఏదో ఒక పని దొరికితే కాస్త డబ్బులు వస్తాయని భావించిన భామిని, మరో మహిళతో కలిసి అక్కడే ఉండిపోయింది. భామినిని గమనిస్తున్న నర్సమ్మ …. గుట్టపై ఉన్న గుడికి రంగులు వేసే పని ఉంది వస్తావా అని అడిగి రూ.700 కూలీకి మాట్లాడుకుని ఇద్దరూ కల్సి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారు.
ద్విచక్రవాహనంపై భామినిని జిన్నారం మండలం మాధారం సమీపంలో ఉన్న అగ్గిరాళ్ల గుట్ట వద్దకు తీసుకెళ్లారు. నడవటానికి కూడా వీలులేని గుట్టపైకి తీసుకెళ్తుండగా భామిని వారిని ఇంకా ఎంత దూరం వెళ్లాలని ప్రశ్నించింది. కొద్దిగా పైకి వెళితే గుడి ఉంటుందని చెప్పారు. అప్పటికే భామిని అలసిపోవడంతో తాను భోజనం చేస్తానని వారికి చెప్పింది.
అనంతరం.. తనకు ఆరోగ్య సమస్య ఉందని, తన భర్త కోరికను తీర్చలేకపోతున్నానని, అందుకు నువ్వు సహకరించాలని నర్సమ్మ, భామినిని కోరింది. భామిని అందుకు నిరాకరించింది. తాను అలాంటి దాన్ని కాదని….కూలి పనికోసం మాత్రమే వచ్చానని తేల్చి చెప్పింది. దీంతో కోపోద్రిక్తులైన ఇద్దరూ భామినిని బలవంతంగా కింద పడేశారు. చేతులు నర్సమ్మ పట్టుకోగా… స్వామి ఆమెపై అత్యాచారం చేశాడు.
అప్పటికీ భామిని అరుస్తూ గొడవ చేస్తుండటంతో పక్కనే ఉన్న కర్ర తీసుకుని ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. సాటి మహిళ అని కూడా చూడకుండా నర్సమ్మ కూడా భామినిపై దాడి చేసి గాయపరిచింది. భామిని వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, సెల్‌ఫోన్ తీసుకుని ఆమెను పెద్ద బండరాళ్ల మధ్యలో పడేసి అక్కడి నుంచి పారిపోయారు. ఎంత రాత్రైనా భామిని ఇంటికి రాకపోవటంతో ఆమె భర్త మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.