వృద్ధురాలిని హత్య చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లారు
రంగారెడ్డి జిల్లాలో దొంగలు భీభత్సం సృష్టించారు. వృద్ధురాలిని హత్య చేసి, బంగారు నగలు ఎత్తుకెళ్లారు.

రంగారెడ్డి జిల్లాలో దొంగలు భీభత్సం సృష్టించారు. వృద్ధురాలిని హత్య చేసి, బంగారు నగలు ఎత్తుకెళ్లారు.
రంగారెడ్డి జిల్లాలో దొంగలు భీభత్సం సృష్టించారు. వృద్ధురాలిని హత్య చేసి, బంగారు నగలు ఎత్తుకెళ్లారు. బాలామణి (80)కి కుమారుడు, ఇద్దరు కూతుర్లున్నారు. కూతుళ్లకు వివాహం అయింది. ఉద్యోగ రీత్యా కూమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. బాలామణికి వ్యవసాయం ఉండడంతో ఆమె ఒక్కరే కందుకూరులో ఉంటోంది. ఇంట్లో ఒంటిరిగా ఉన్న వృద్ధురాలిని దొంగలు గొంతు నుమిలి హత్య చేశారు.
అనంతరం ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మృతదేహన్ని ఇంటి సమీపంలో పడేశారు. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు. అంతరాష్ట్ర ముఠా పనా..? లేక తెలిసిన వారే హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
వృద్ధు రాలి హత్యపై పోలీసులు అన్ని కొణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. హత్య చేసిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.