కంటైనర్ ఢీ కొని ఏనుగు మృతి

కంటైనర్ ఢీ కొని ఏనుగు మృతి

Updated On : January 16, 2021 / 1:37 PM IST

elephant died in container accident in chittoor district : చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులో జాతీయ రహాదారిపై కంటైనర్ ఢీకొని ఏనుగు మృతి చెందింది. కృష్ణగిరి – సూలగిరి జాతీయ రహదారిలో రోడ్డు దాటుతున్న ఏనుగును భారీ కంటైనర్ ఢీ కొట్టింది. దీంతో ఏనుగు తీవ్రంగా గాయపడి కింద పడిపోయింది. కొంత సేపటికి ఏనుగు కన్నుమూసింది. ఏనుగు మృతితో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ఇటీవలి కాలంలో నగిరి నియోజకవర్గం, పుత్తూరు పరిసర ప్రాంతాలలో ఏనుగులు హాల్ చల్ చేస్తున్నాయి. రాత్రిపూట పలు చోట్ల పంట ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగులు సంచరించే ప్రాంతాలలో రాత్రిపూట ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.