జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదుల హతం

  • Published By: veegamteam ,Published On : May 3, 2019 / 06:23 AM IST
జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదుల హతం

Updated On : May 3, 2019 / 6:23 AM IST

జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హత మయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాన్ కు గాయాలయ్యాయి. 

దక్షిణ కాశ్మీర్ లోని హిమామ్ షాహీబ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో రాష్ట్రీయ రైఫిల్, స్పెషల్ ఆఫీసర్స్ టీమ్, ఆర్మీ బలగాలు కూంబింగ్ నిర్వహించారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు. ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా..జవాన్ కు గాయాలయ్యాయి. షోపియాన్ జిల్లాలో ఇంటర్ నెట్ సేవలను నిలిపి వేశారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది.

మే 6న షోపియాన్, అనంతనాగ్ లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో ఉగ్రవాద కదలికలను భద్రతా దళాలు గుర్తిస్తున్నాయి. ఇందులో భాగంగానే వీరిని హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు. వీరి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారం రోజుల క్రితం అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులను హత మార్చారు. పుల్వామా ఘటన జరిగినప్పటి ఇప్పటివరకు 70 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టారు. ఎన్నికలున్న నేపథ్యంలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించి వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.