గాంధీ ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ : 5 నెలలుగా వైద్యం చేస్తున్నట్లుగా గుర్తింపు
కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలను భయపెడుతుంటే హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ హల్ చల్ చేస్తున్నాడు. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఫేక్ డాక్టర్ పట్టుబడ్డాడు.

కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలను భయపెడుతుంటే హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ హల్ చల్ చేస్తున్నాడు. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఫేక్ డాక్టర్ పట్టుబడ్డాడు.
కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలను భయపెడుతుంటే హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ హల్ చల్ చేస్తున్నాడు. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఫేక్ డాక్టర్ పట్టుబడ్డాడు. 5 నెలలుగా గాంధీలో వైద్యం చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. కార్డియాలజీ పేరుతో బ్యాడ్జీ తగలించుకుని, డబ్ల్యుహెచ్ ఓ పేరుతో ఐడెంటీ కార్డుతో నకిలీ డాక్టరు తిరుగుతున్నాడు. అతను ముంబై నుంచి వచ్చిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. మరోవైపు ఆస్పత్రిలో కనీస భద్రత లేకుండా పోయిందని రోగులు అంటున్నారు.
నకిలీ డాక్టర్ ను పట్టుకుని ప్రశ్నించాకే పోలీసులకు అప్పగించామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.శ్రవణ్ తెలిపారు. ఐదు నెలలుగా ఆస్పత్రిలో తిరుగుతున్నట్లుగా గుర్తించామని తెలిపారు. ‘డాక్టర్ అంటూ ఒక పేషెంట్ నాప్రాన్, స్టెతస్కోప్ వేసుకుని తిరుగుతున్నాడు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మాట చెబుతున్నాడు. జనరల్ మెడిసిన్ డిపార్ట్ మెంట్ లో ఒక మాట చెప్పాడు. కార్డియాలజీ, ఐసీయూలో వేర్వేరుగా చెప్పాడని తెలిపారు. ఆస్పత్రిలో చాలా మంది డాక్టర్లు ఉంటారని..అందరికీ ఐడీ కార్డులు ఉన్నాయని తెలిపారు. ఫేక్ డాక్టర్ డబ్ల్యుహెచ్ వో ఐడీ కార్డు వేసుకుని తిరుగుతున్నాడు’ అని సూపరింటెండెంట్ తెలిపారు.
‘డబ్ల్యుహెచ్ వో ఐడీ కార్డుతో తిరుగుతుంటే స్వైన్ ఫ్ల్యూ ఉంది కనుక ప్రత్యేకంగా డబ్ల్యుహెచ్ వో నుంచి రిప్రజెంటేటివ్ గా వచ్చిన డాక్టర్ అని భావించామని స్టూడెంట్స్ తెలిపినట్లు పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్ లో పనిచేస్తున్నట్లుగా పీజీ స్టూడెంట్స్ కు చెప్పారు. అప్పుడు పీజీ విద్యార్థులందరూ అతన్ని పట్టుకున్నారు. తామంతా పీజీ స్టూడెంట్స్ అని తమకు తెలియకుండా నీవు ఎలా పని చేస్తున్నావని నిలదీశారు.
అప్పుడు అతను వారికి ఐడీ కార్డు చూపించారని తెలిపారు. దీంతో అతను ఫేక్ డాక్టర్ గా గుర్తించామని తెలిపారు. అతన్ని పోలీసులకు అప్పగించామని తెలిపారు. అతనిపై కేసు నమోదు చేశారని తెలిపారు. ఇలాంటి వారిని పోలీస్ లాకప్ లో పెట్టి సీరియస్ గా దృష్టి పెట్టాలని, ఎఫ్ ఐఆర్ బుక్ చేయాలని పోలీసులకు చెప్పాము’ అని సూపరింటెండెంట్ డా.శ్రవణ్ తెలిపారు.