Farmer Suicide : కామారెడ్డి జిల్లాలో రైతు ఆత్మహత్య

అనారోగ్యానికి గురైన ఒక రైతు ఆస్పత్రుల ఖర్చులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

Farmer Suicide : కామారెడ్డి జిల్లాలో రైతు ఆత్మహత్య

New Project

Updated On : November 30, 2021 / 9:27 PM IST

Farmer Suicide :  అనారోగ్యానికి గురైన ఒక రైతు ఆస్పత్రుల ఖర్చులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన బలరాం నాయక్ అనే రైతు కొద్దిరోజులుగా వెన్నుపూస నొప్పితో బాధపడుతున్నాడు.

ఇటీవల హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. దీనికి రూ.8 లక్షల వరకు ఖర్చు అయ్యింది . అయినా కానీ అతనికి ఆరోగ్యం కుదుట పడలేదు. ఇంకా  వెన్ను నోప్పిగానే  ఉంటోంది.  దీంతో మళ్లీ వైద్యం చేయించుకునే ఆర్ధిక స్తోమత లేక ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న రాజంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Chaddy Gang : విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ దోపిడీ