గొంతుపై కాలుతోతొక్కి ముగ్గురు కూతుళ్లను తండ్రి చంపేశాడు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోలులో దారుణం జరిగింది. ముగ్గురు కూతుళ్లను ఓ కసాయి తండ్రి హత్య  చేశాడు.

  • Published By: veegamteam ,Published On : March 6, 2020 / 09:16 AM IST
గొంతుపై కాలుతోతొక్కి ముగ్గురు కూతుళ్లను తండ్రి చంపేశాడు

Updated On : March 6, 2020 / 9:16 AM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోలులో దారుణం జరిగింది. ముగ్గురు కూతుళ్లను ఓ కసాయి తండ్రి హత్య  చేశాడు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోలులో దారుణం జరిగింది. ముగ్గురు కూతుళ్లను ఓ కసాయి తండ్రి హత్య  చేశాడు. రాజారామ్ దుబ్బచెరువులో ముగ్గురు అక్కాచెళ్లెళ్ల మృతదేహాలు బయటపడ్డాయి. మృతులు అఫియా, మహీన్, జియాగా గుర్తించారు. మద్యానికి బానిసైన ఫయాజ్ ముగ్గురు కూతుళ్లను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కుటుంబ కలహాలతో కూతుళ్లను తండ్రి ఫయాజ్ హత్య చేశాడు.

తాడ్కోలులో నివాసముంటున్న ఫయాజ్ కు భార్య, ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. నిన్న సాయంత్రం పేకాట ఆటలో బాగా డబ్బులు రావడంతో ఫయాజ్ ఫుల్ గా మద్యం తాగాడు. ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం ఫయాజ్ తన ముగ్గురు కూతుళ్లు, కొడుకును తీసుకొని చెరువు వైపు వెళ్లాడు. అయితే కుమారుడు తప్పించుకున్నాడు.

మిగిలిన ముగ్గురు కూతుళ్ల గొంతుపై కాలు పెట్టి తొక్కాడు. కూతుళ్లు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ముగ్గురి మృతదేహాలను రాజారామ్ దుబ్బాక చెరువులో పడేశాడు. స్థానికులు సంఘటనకు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందింన వెంటనే బాన్సువాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులో పడి ముగ్గురు ఆడపిల్లల మృతదేహాలను బయటకు తీశారు. 

గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన కుటుంబీకులు నిందితుడిని తమకు అప్పగించాలని అంటున్నారు. ఫయాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.  

See Also | పోలీస్ స్టేషన్ పై నుంచి దూకి టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం