Suicide Attempt : వైసీపీ నేత వేధింపులు భరించలేక ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడి వేధింపులు భరించలేక ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Suicide Attempt : వైసీపీ నేత వేధింపులు భరించలేక ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం

Field Assistant Suicide Attempt

Updated On : June 30, 2021 / 8:37 PM IST

Suicide Attempt : తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడి వేధింపులు భరించలేక ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాయవరం మండలం నదురుబాద గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ విత్తనాల ముత్యాల రావు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

వైసీపీ జిల్లా ప్రచారకమిటీ కన్వినర్ సిరిపురపు శ్రీనువాసరావు వేధింపులు భరించలేకే తాను ఈ పని చేస్తున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కోన్నాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు.  అతని ఆరోగ్య పరిస్ధితి విషమించటంతో రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కు తరలించారు.